ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలతో పోటీకి దిగి అందరి చూపు తనపైనే పడేలా చేసుకున్న ప్రశాంత్ వర్మ-తేజ సజ్జల హనుమాన్ ఆ సంక్రాంతి సినిమాలని వెనక్కి నెట్టి సత్తా చాటింది. ప్రీమియర్స్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన హనుమాన్ ప్యాన్ ఇండియాలోనూ తన బలాన్ని చూపించింది. గుంటూరు కారంతో మహేష్ కి ఎదురెళ్లి మరీ సక్సెస్ సాధించడంతో హనుమాన్ మాట సోషల్ మీడియాలో మోగిపోయింది. ప్రేక్షకులు కూడా డివోషనల్ టచ్ ఉన్న హనుమాన్ ని బాగా ఇష్టపడ్డారు.
ఇక 250 కోట్ల కలెక్షన్స్ తో హాట్ టాపిక్ గా మారిన హనుమాన్ ఎప్పుడెప్పుడు ఓటిటిలోకి వస్తుందా అని ప్రేక్షకులు, ఫ్యామిలీ ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. జీ5 వేదికగా స్ట్రీమింగ్ కానున్న హనుమాన్ అన్ని సినిమాల్లా అసలైతే ఫిబ్రవరి రెండోవారంలోనే ఓటిటీ లోకి వస్తుంది అనుకున్నారు, కానీ ఇప్పుడు దానికొచ్చిన స్పందన చూసి ఆ ఓటిటీ తేదీని జీ5 మార్చి మూడో వారంకి షిఫ్ట్ చేసిందట. అంటే హనుమాన్ ని ఇంట్లోనే కూర్చుని వీక్షించాలంటే మార్చ్ మూడో వరకు వెయిట్ చెయ్యాలసిందే.