Advertisement
Google Ads BL

డీప్ ఫేక్‌పై మరోసారి రష్మిక


డీప్ ఫేక్ వీడియోపై మరోసారి రష్మిక మందన్నా మాట్లాడింది. 2023లో హాట్ టాపిక్ అయిన విషయాలలో రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో కూడా ఒకటి. ఆ వీడియో విషయంలో పలువురు ప్రముఖులు ఆమెకు మద్దతుగా నిలిచారు. అలాగే రీసెంట్‌గా ఆ వీడియోకి కారణమైన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. అరెస్ట్‌పై కూడా రష్మిక స్పందించి.. పోలీసులకు, తనకు మద్దతుగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలిపింది. తాజాగా ఇప్పుడామె ఎందుకసలు ఆ డీప్ ఫేక్ వీడియోపై స్పందించాల్సి వచ్చిందో.. ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది.

Advertisement
CJ Advs

నేను రియాక్ట్ అయ్యాను కాబట్టే.. ఈ ఇష్యూ అందరికీ తెలిసింది. నేను కామ్‌గా ఉంటే.. అంత పెద్దగా ఇది జనాల్లోకి వెళ్లేది కాదు.. పరిష్కారం లభించేది కాదు. ఇలాంటి వీడియోలపై అందరికీ అవగాహన కల్పించాలనే నేను రియాక్ట్ అయ్యాను అని తెలిపింది రష్మిక. ఇలాంటి చేదు అనుభవం నాకు కాలేజీ రోజుల్లో ఎదురై ఉంటే ఎవరూ నాకు మద్దతు ఇచ్చేవారు కాదు. ఎవరైనా రియాక్ట్ అవ్వాలని చూసినా.. వారి గురించి సమాజం ఎలా తీసుకుంటుందో అని భయపడేవారు.

నేను కూడా ఈ వీడియో విషయంలో ఒకటికి 10 సార్లు ఆలోచించిన తర్వాతే రియాక్ట్ అయ్యాను. నేను రియాక్ట్ అయితే నా ఫాలోయర్స్ 41మిలియన్ల మందికి తెలుస్తుంది. వారంతా ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేస్తారు. అయినా సరే.. ప్రజల్లో అవగాహన కల్పించాలని స్ట్రాంగ్‌గా ఫిక్సయ్యాను. ముఖ్యంగా కాలేజీలలో చదువుకునే అమ్మాయిలలో ధైర్యం నింపడం కోసమే రియాక్ట్ అయ్యాను. డీప్ ఫేక్ సాదారణ లైఫ్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీనిపై అందరూ అలెర్ట్‌గా ఉండాలంటూ రష్మిక చెప్పుకొచ్చింది.

Rashmika Mandanna Again on Deepfake Videos:

Thats why I am Reacted on DeepFake Video Says Rashmika
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs