Advertisement
Google Ads BL

గెట్టింగ్ రెడీ ఫర్.. విశ్వంభర


మెగాస్టార్ చిరంజీవికి ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్ అంతే. ఈ వయసులో కూడా ఆయన కుర్ర హీరోలకు పోటీ ఇచ్చేలా.. తన స్టామినాని చూపిస్తున్నారంటే.. ఆయనలో ఉన్న కృషి, పట్టుదల ఏంటో అర్థం చేసుకోవచ్చు. రీసెంట్‌గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులలో పద్మ విభూషణుడైన చిరంజీవి.. అభినందనల వెల్లువలో మునిగితేలుతున్నారు. ఆయనని అభినందించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు గ్యాప్ లేకుండా వస్తూనే ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఇంకెవరైనా కూడా ఆకాశంలో తేలుతుంటారు. కానీ మెగాస్టార్ మాత్రం.. మెగా156 కోసం సిద్ధమవుతున్నారు. అదే ఆయనలోని గొప్పతనం.

Advertisement
CJ Advs

అభినందనల వెల్లువలో ఎక్కడ తనని తాను మరిచిపోతానోనని అనుకున్నారో.. ఏంటో తెలియదు కానీ.. అది అదే, ఇది ఇదే అనేలా తన తదుపరి ప్రాజెక్ట్ మెగా156 విశ్వంభర షూటింగ్‌కు సిద్ధమవుతున్నట్లుగా ఓ వీడియోని తాజాగా ఆయన షేర్ చేశారు. ఈ వీడియోలో చిరంజీవి చేస్తున్న కసరత్తులు చూస్తుంటే.. అందుకే ఆయన జనాల గుండెల్లో ఖైదీ అయ్యారని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. ఈ వయసులో ఆయన డెడికేషన్.. అందరికి స్ఫూర్తి అంటూ నెటిజన్లు అందరూ ఆల్ ద బెస్ట్ అన్నయ్యా అని మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇక గెట్టింగ్ రెడీ ఫర్.. విశ్వంభర అంటూ వీడియో ఎండింగ్‌లో తన మార్క్ డైలాగ్‌తో.. విశ్వంభర ఎలా ఉండబోతుందో సింపుల్‌గా హింట్ ఇచ్చేశారు మెగాస్టార్. బింబిసార ఫేమ్ వశిష్ట ఈ మెగా ఫాంటసీ అడ్వెంచర్‌కు దర్శకత్వం వహిస్తుండగా.. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు. 2025 సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు.

Gearing up .. And raring to go Vishwambhara says Chiranjeevi:

Chiranjeevi Workouts for Vishwambhara
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs