Advertisement
Google Ads BL

కాబోయేవాడిపై తృప్తి డిమ్రి కామెంట్స్


యానిమల్ సినిమాతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చిన బ్యూటీఫుల్ భామ తృప్తి డిమ్రి. యానిమల్ సినిమా ఎంత సక్సెస్ సాధించిందో.. అంతకంటే గొప్పగా ఈ సినిమాలో నటించిన తృప్తి డిమ్రికి పేరొచ్చింది. ఇప్పుడామెను సినిమాల్లోకి తీసుకునేందుకు దర్శకనిర్మాతలు తెగ ఎగబడుతున్నారు. కారణం ఆమెలో ఉన్న టాలెంటే. యానిమల్‌లో ఆమె అలా కనిపించడానికి చూపిన ధైర్యం.. ఇప్పుడందరికీ ముచ్చటేస్తుంది. అందులోని ఒకే ఒక్క సీన్ అందరినీ ఆకర్షించి.. ఆమెను నేషనల్ క్రష్ అయ్యే స్థాయికి తీసుకెళ్లింది. ప్రస్తుతం ఏ హీరో సినిమా పేరు విన్నా.. అందులో తృప్తి డిమ్రినే హీరోయిన్ అనేలా వార్తలు వైరల్ అవుతున్నాయంటే ఆమె ఇంపాక్ట్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

Advertisement
CJ Advs

సినిమాల సంగతి ఇలా ఉంటే.. తాజాగా ఆమెపై పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆమె అటెండ్ అయిన లేటెస్ట్ ఇంటర్వ్యూలో కూడా ఆమెకు ఇదే ప్రశ్న ఎదురైంది. మీ పెళ్లి అంటూ వార్తలు వస్తున్నాయి కదా.. నిజమేనా? అని అడిగితే.. ఇప్పుడప్పుడే అలాంటి ఆలోచనలు ఏం లేవని చెప్పుకొచ్చిందీ అమ్మడు. ప్రస్తుతం పెళ్లి గురించి ఆలోచనలు లేవు.. ముందు కెరీర్‌ని నిలబెట్టుకోవాలి. మంచి నటిగా పేరు తెచ్చుకోవాలి అని చెప్పింది. పెళ్లి గురించి ఇలా చెప్పిన తృప్తి.. కాబోయేవాడి గురించి ఓ హింట్ కూడా ఇచ్చింది. 

తనకు కాబోయేవాడికి డబ్బు, పరపతి ఉన్నా లేకపోయినా.. అతడికి మంచి మనసు ఉంటే చాలు. నా అభిప్రాయాన్ని గౌరవించే వ్యక్తి అయితే చాలు.. అంటూ ఆమె చెప్పిన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో మరోసారి తృప్తి డిమ్రి పేరు నేషనల్ వైడ్‌గా టాప్‌లో ట్రెండ్ అవుతోంది. 

Tripti Dimri Clarity about Marriage Rumours on Her:

Tripti Dimri Opens About Her Husband Qualities
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs