నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా మెగాస్టార్‌తో చేసిన వాల్తేరు వీరయ్యతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న NBK109 సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది. వాస్తవానికి ఈ మధ్య కాలంలో బాలయ్య సినిమా ఏది అనౌన్స్ అయినా.. అందులో నటించే హీరోయిన్ల విషయంలో గందరగోళం నెలకొంటూ ఉంటుంది. సినిమా అంతా సెట్టయ్యి, సెట్స్‌పైకి వెళ్లే సమయానికి తక్కువలో తక్కువ ఓ అరడజను హీరోయిన్ల పేర్లు వినిపిస్తుండటం కామన్ అయిపోయింది. ఫైనల్‌గా ఆ అరడజను మందిలో నుండి కాకుండా వేరే అమ్మాయి బాలయ్య సరసన హీరోయిన్‌గా ఆ సినిమాకు ఫిక్స్ అవుతుంది.
అలాగే ఇప్పుడు బాబీతో చేస్తున్న ఈ సినిమా విషయంలో కూడా ఇప్పటికే దాదాపు ఓ ముగ్గురు నలుగురు పేర్లు వినిపించాయి. ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా NBK109లో బాలయ్య సరసన హీరోయిన్ ఫిక్స్ అయిందంటూ.. ఓ భామ పేరు వినిపిస్తుంది. ఆ భామ ఎవరో కాదు.. జెర్సీలో నాని సరసన, సైంధవ్‌లో వెంకీ సరసన నటించిన శ్రద్ధా శ్రీనాధ్ హీరోయిన్‌గా ఫిక్స్ అయిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆమెపైనే సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం ఎంతుందనేది తెలియదు.. అలాగే మేకర్స్ కూడా హీరోయిన్ల విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
ఇంతకు ముందు వాల్తేరు వీరయ్య సినిమాలో ఓ పాటలో మెరిసిన ఊర్వశీ రౌతేలా ఇందులో ఓ కీలక పాత్ర చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ విషయం ఆమె కూడా కన్ఫర్మ్ చేసింది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఇందులో విలన్‌గా నటిస్తుండగా.. ఈ చిత్ర సెట్స్‌లోకి అతనికి ఊర్వశి వెల్‌కమ్ కూడా పలికింది. అలాగే ఇందులో మీనాక్షి చౌదరి కూడా ఓ పాత్రలో చేస్తున్నట్లుగా టాక్ నడుస్తోంది. మరి ఈ వార్తలు నిజమో కాదో.. తెలియాలంటే మాత్రం ఇంకొంత కాలం వెయిట్ చేయక తప్పదు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ వేసవికి ఈ సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది.