Advertisement
Google Ads BL

మోస్ట్ డేంజరస్ హౌస్‌వైఫ్ రాక ఖరారు


ఓటీటీలోకి మోస్ట్ డేంజరస్ హౌస్‌వైఫ్ రాక ఖరారైంది. ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన భామా కలాపం ఆహా ఒరిజినల్‌గా విడుదలైన మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు సీక్వెల్ భామా కలాపం2 తో మరోసారి మోస్ట్ డేంజరస్ హౌస్‌వైఫ్‌గా ప్రియమణి తన టాలెంట్‌ని చూపించబోతోంది. తాజాగా ఈ భామా కలాపం 2 టీజర్‌ని, అలాగే స్ట్రీమింగ్ డేట్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ చూస్తుంటే.. మరోసారి ప్రియమణి ఓటీటీ వీక్షకులకు మంచి ట్రీట్ ఇవ్వబోతుందనేది అర్థమవుతోంది.

Advertisement
CJ Advs

అమాయకపు గృహిణి అనుపమ పాత్రలో ప్రియమణి ఇందులో కనిపించారు. తన గత జీవితాన్ని, అపార్ట్‌మెంట్‌ను విడిచిపెట్టి.. తన భర్తకు ఇచ్చిన మాట ప్రకారం కొత్త లైఫ్‌ని ప్రారంభిస్తుంది. ఈ టీజర్ స్టారింగ్‌లోనే అనుపమ అనే నేను, పక్క వాళ్ళ విషయాలలో తలదూర్చను అని, నా పని నేను చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటానని మాట ఇస్తున్నట్లుగా చూపించారు. మాట అయితే ఇచ్చింది కానీ.. వెంటనే ఓ హత్య చేయడం కనిపిస్తుంది. ఈ హత్య నుండి ఈ మోస్ట్ డేంజరస్ వైఫ్ ఎలా బయటపడిందనేదే.. భామా కలాపం 2 ప్రధానాంశంగా ఈ టీజర్‌తో తెలుస్తోంది.

వినోదంతో పాటు చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇందులో ఉన్నట్లుగా ఈ టీజర్‌తో అర్థమవుతోంది. ప్రియమణి, శరణ్య ప్రదీప్ టైమింగ్.. నవ్వులు పూయిస్తుంది. డైలాగ్స్, యాక్షన్ ఇలా అన్నీ కలగలిపిన ఈ భామాకలాపం 2ని ఫిబ్రవరి 16న స్ట్రీమింగ్‌కు సిద్ధం చేస్తున్నట్లుగా ఆహా ఓటీటీ ప్రకటించింది. ఆహా స్టూడియోస్‌తో కలిసి బాపినీడు మరియు సుధీర్ ఈదర అసోసియేషన్ డ్రీమ్ ఫార్మర్స్ నిర్మిస్తున్న ఈ భామాకలాపం 2కు అభిమన్యు తడిమేటి దర్శకుడు. సీరత్ కపూర్, శరణ్య, రఘు ముఖర్జీ, బ్రహ్మాజీ తదితరులు ఇతర పాత్రలలో నటించారు.

Bhamakalapam 2 Teaser Out:

Bhamakalapam 2 Movie Streaming Date Fixed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs