Advertisement
Google Ads BL

పుష్ప2 నుండి ఫొటో లీకైంది


టాలీవుడ్‌ని లీక్‌లు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కాస్త తగ్గింది కదా.. అనుకుంటే మళ్లీ మొదలైనట్లుగా.. తాజాగా అల్లు అర్జున్, సుకుమార్ సినిమా పుష్ప2 నుండి ఓ ఫొటో లీకై.. సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ ఫొటో లీక్‌పై పుష్ప2 టీమ్‌ని సుకుమార్ హెచ్చరించినట్లుగా కూడా టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తుంది. అంతేకాదు, ఎవరీ ఫొటోని లీక్ చేశారనే దానిపై కూడా నిర్మాతలు ఆరా తీస్తున్నట్లుగా టాక్ వినబడుతోంది. ఏదయితేనేం.. పుష్ప2 టీమ్‌ని మరోసారి ఈ లీక్ అలెర్ట్ చేసింది.

Advertisement
CJ Advs

ఇంతకుముందు కూడా ఇలా లీక్స్ వచ్చినప్పుడు మేకర్స్ జాగ్రత్తలు వహించారు. సీరియస్‌గా టీమ్‌ని హెచ్చరించారు కూడా. ఇప్పుడొచ్చిన లీక్‌తో.. ఇంకాస్త కఠినంగా టీమ్‌పై సెట్‌లో ఆంక్షలు పెట్టే యోచనలో దర్శకనిర్మాతలు ఉన్నట్లుగా టాక్ నడుస్తోంది. ఇక లీకైన ఫొటోలో అల్లు అర్జున్ చీరకట్టులో జాతరకు సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తున్నారు. ఇందులో గంగమ్మ జాతర ఎపిసోడ్ ఉంటుందనేలా.. ఇప్పటికే మేకర్స్ హింట్ ఇచ్చి ఉన్నారు. ఇప్పుడొచ్చిన ఈ లీక్‌తో.. ఆ సన్నివేశాలు ప్రేక్షకులకు థ్రిల్ ఇస్తాయనేది స్పష్టమవుతోంది.

ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ జాతరకు సంబంధించిన సెట్‌లో షూట్ జరుగుతోంది. అయితే లీక్డ్ ఫొటోతో సినిమాకు డ్యామేజ్ జరుగుతుందని మేకర్స్ అనుకుంటున్నారు కానీ.. ఈ ఫొటో ఇప్పుడీ సినిమా గురించి అంతా మాట్లాడుకునేలా చేస్తోంది. గంగమ్మ జాతరలో అమ్మవారి గెటప్‌లో అల్లు అర్జున్ కనిపించనున్నారు.

Pushpa The Rule leaked snap increases excitement:

Pushpa Raj leaked snap goes viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs