Advertisement
Google Ads BL

రాశీ ఖన్నా.. రచ్చరంబోలా..


రాశీ ఖన్నా అని సోషల్ మీడియాలో కొడితే చాలు.. కత్తిలాంటి ఫొటోలు దర్శనమిస్తున్నాయి. అసలు డ్రస్ ఉందా? లేదా? అనేలా ఉన్న ఈ ఫొటోల్లో రాశీ ఖన్నా గ్లామర్ డోస్ మాములుగా లేదు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఎలాంటి కాంపిటేషన్ ఉందో తెలియంది కాదు. ఆ కాంపిటేషన్‌ను తట్టుకుని నిలబడాలంటే.. ఇలాంటివి అవసరం అని భావించినట్లుంది. రాశీ ఖన్నా ఈ మధ్య ఇలాంటి ట్రీట్ బాగానే ఇస్తోంది. లిప్‌లాక్స్, ఎక్స్‌పోజింగ్ వంటి వాటికి నో చెప్పని రాశీ ఖన్నాకు లేనిది ఏంటంటే.. అదృష్టమే. 

Advertisement
CJ Advs

ఆమె పేరు హైలెట్ అయ్యేలా సరైన హిట్టు ఒక్కటీ పడటం లేదు. శ్రీలీల మాదిరిగా డ్యాన్స్‌తో ఏమైనా నెట్టుకొస్తుందా? అంటే, అలాంటి ఛాన్స్ కూడా ఈ భామకు రావడం లేదు. అందుకే అంది.. ఎన్ని ఉన్నా.. కాస్త అదృష్టం కూడా ఉండాలని. ఏదయితేనేం.. ఈ ఫొటోల పుణ్యమా అని.. రాశీ ఖన్నా పేరు అయితే బాగానే వైరల్ అవుతోంది. మరి ఈసారైనా ఆమెకు అదృష్టం తలుపుతడుతుందేమో చూద్దాం. ఇక ఈ ఫొటోలతో పాటు.. వీడియో కూడా సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. వీటిని చూసిన వారంతా ఎక్కడిది? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం రాశీ ఖన్నా బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేస్తోంది. బాలీవుడ్‌లో తను నటిస్తోన్న ఓ సినిమాలోని పాట చిత్రీకరణ కోసం ముంబైలో ఇలా ఆమె దర్శనమిచ్చింది. ముంబై మహాబూబ్ స్టూడియోలో ఇలా మోడ్రన్‌గా కనిపించి.. అందరి అటెన్షన్‌ని ఆమె సొంతం చేసుకుంది. ప్ర‌స్తుతం ఆమె బాలీవుడ్‌లో స‌బ‌ర్మ‌తి రిపోర్ట్‌, యోధ‌, టైమ్ వంటి సినిమాలలో నటిస్తోంది.

Raashii Khanna Exudes Glamour:

Raashii Khanna Stuns With Her Revealing Outfit
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs