Advertisement
Google Ads BL

కని పెంచిన అమ్మకి ప్రేమతో.. : చిరు


మెగాస్టార్‌ చిరంజీవి మాతృమూర్తి అంజనా దేవి పుట్టినరోజు నేడు (జనవరి 29). తన మాతృమూర్తి పుట్టినరోజును మెగాస్టార్ చిరంజీవి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. తన కుటుంబ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేసి.. అంజనమ్మకు తినిపించారు. ఈ సెలబ్రేషన్‌కి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన మెగాస్టార్.. కనిపించే దేవత, కని పెంచిన అమ్మకి ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement
CJ Advs

చిరంజీవికి తన మాతృమూర్తి అంజనాదేవి అంటే ఎంతిష్టమో ఎన్నో సందర్భాలలో తెలిపారు. మాతృమూర్తి అంటే ఎవరికైనా ఇష్టమే ఉంటుంది కానీ.. ఈ విషయంలో కూడా చిరంజీవి అందరికీ స్ఫూర్తినిస్తున్నారు. పెద్ద వయసు వచ్చిన వారిని చిన్నపిల్లల మాదిరిగా చూసుకోవాలి అని.. ఆయన చేసే ప్రతి పనిలో తెలియజేస్తూనే ఉన్నారు. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. అంజనమ్మ కూడా తన బిడ్డల పట్ల ఎంత ప్రేమతో ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా మెగాస్టార్ గురించి మాట్లాడాలంటే ఆమె భావోద్వేగానికి గురవుతుంటారు. చిరు అంటే ఆమెకు అంతిష్టం మరి.

మెగాస్టారే కాదండోయ్.. మెగాభిమానులు కూడా అంజనమ్మను అమ్మలానే కొలుస్తారు. ఆ విషయం చిరు చేసిన ఈ పోస్ట్‌కి వస్తున్న కామెంట్స్‌ చూస్తే తెలుస్తుంది. మాకు ఇంత గొప్ప వ్యక్తిని, అనుక్షణం అభిమానుల గురించి తపించే అన్నయ్యను ఇచ్చినందుకు నీకు రుణపడి ఉంటాం అంజనమ్మా అంటూ ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్స్‌తో ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Chiranjeevi Celebrates His Mother Birthday Grandly:

Happy Birthday to Anjana Devi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs