రాజమౌళి మేకింగ్ స్టైల్ అంటే ఎంతో ఇష్టం కానీ.. ఆయనంటే కోపం కూడా ఉందని అన్నారు హను-మాన్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ యూనివర్స్ నుండి వచ్చిన మొట్టమొదటి చిత్రం హను-మాన్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తూ.. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. చిత్ర సక్సెస్‌ను పురస్కరించుకుని పలు మీడియా సంస్థలకు ప్రశాంత్ వర్మ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఓ ఇంటర్వ్యూలో దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళిపై ప్రశాంత్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రాజమౌళి అంటే తనకు బాగా కోపం వచ్చిన సందర్భాన్ని షేర్ చేసుకున్నాడు.
రాజమౌళిగారి మేకింగ్ స్టైల్ అంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన దగ్గర అసిస్టెంట్‌గా జాయిన్ అవుదామని చాలా సార్లు ట్రై చేశాను. ఇంజనీరింగ్ చదివే రోజుల్లోనే ఆయనకు ఎన్నో మెయిల్స్ పెట్టాను. తన టీమ్‌లో ఖాళీ లేదని చెప్పి.. సున్నితంగా తిరస్కరించారు. నేను హార్డ్ వర్కర్‌ని, టాలెంట్ ఉన్నప్పటికీ ఆయన నన్ను ఎందుకు దూరం పెడుతున్నారని చాలా కోపం తెచ్చుకునేవాడిని. అయినా సరే, ఆయననే గురువుగా భావించి.. ఏకలవ్య శిష్యుడిగా మారిపోయాను. రాజమౌళిగారి సినిమాలు, మేకింగ్ వీడియోలు నాకు ఎన్నో విషయాలు నేర్పాయి.. అని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చారు.
రాజమౌళిపై ప్రశాంత్ వర్మ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఒక్క సినిమాకే ఈ కుర్ర దర్శకుడికి బాగా పెరిగిపోయిందంటూ.. రాజమౌళిని అభిమానించే వారంతా వర్మపై సీరియస్ అవుతున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం నేర్చుకోమంటూ.. ప్రశాంత్ వర్మకి హితబోధ చేస్తున్నారు.