Advertisement
Google Ads BL

ఈ కాంబో కనుక సెట్ అయితేనా?


ఈ పిక్ చూసిన ప్రతి ఒక్కరూ అనుకునేది ఇదే. ఇటీవల యానిమల్ సినిమాతో తనెంటో మరోసారి ప్రూవ్ చేసుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో చేసిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించడంతో పాటు.. బాలీవుడ్‌కు ఊపిరిపోసింది. అయితే మెగాస్టార్ చిరంజీవికి సందీప్ వంగా డై హార్డ్ ఫ్యాన్ అనే విషయం తెలిసిందే. ఎంత డై హార్డ్ ఫ్యాన్ అంటే.. అప్పుడెప్పుడో వచ్చిన మాస్టర్ సినిమాలో ఓ సన్నివేశంలో చిరు సిగరెట్ కాల్చే సీన్ గుర్తు చేస్తూ.. ఆ సీన్‌లో ఆయన ఏ కలర్ షర్ట్ వేసుకున్నాడో కూడా చెప్పేంత గొప్ప ఫ్యాన్. అలాంటి ఫ్యాన్‌కి చిరుని డైరెక్ట్ చేసే అవకాశం వస్తే.. మాములుగా ఉంటుందా? 

Advertisement
CJ Advs

ఫ్యాన్స్ కూడా అదే కోరుకుంటున్నారు. చిరు, వంగా కాంబినేషన్‌లో ఒక్క సినిమా పడితే బాగుండు అని అనుకోని మెగా ఫ్యాన్ లేడంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. సందీప్ కూడా సిద్ధం అంటూ సిగ్నల్స్ పంపుతున్నాడు. అన్నీ కలిసొస్తే.. త్వరలోనే వీరి కాంబినేషన్‌లో సినిమా ఉండే అవకాశం అయితే లేకపోలేదు. ఇక మెగాస్టార్‌కి కేంద్రప్రభుత్వం పద్మవిభూషణ్ ప్రకటించగానే ఇండస్ట్రీ మొత్తం చిరు ఇంటిలో వాలిపోయింది. 

ఆయనకు అభినందనలు తెలిపేందుకు ఇండస్ట్రీ ప్రముఖులెందరో క్యూ కట్టారు. అభినందనలు తెలిపి తమ అభిమానం చాటుకున్నారు. ఈ లిస్ట్‌లో సందీప్ రెడ్డి వంగా కూడా ఉన్నారు. పై పిక్ సందర్భమదే. దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో కలిసి సందీప్ ఇలా మెగాస్టార్ ఇంట్లో దర్శనమిచ్చాడు. ఈ పిక్ చూసిన తర్వాత మెగా ఫ్యాన్స్‌కి మరింతగా కోరిక కలుగుతోంది. మరి వారి కోరిక ఎప్పటికి నెరవేరుతుందో చూద్దాం.. 

Sandeep Reddy Vanga Met Chiranjeevi at His House:

Fans Wants Movie in Chiru and Sandeep Vanga Combination
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs