Advertisement
Google Ads BL

అఘోరాగా విశ్వక్ సేన్.. గామి లుక్!


మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వైవిధ్యభరిత చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. మధ్యమధ్యలో డైరెక్షన్ అంటూ తన మల్టీటాలెంట్ ప్రదర్శించే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. ఇప్పుడాయన నటిస్తోన్న మరో వినూత్న చిత్రం గామి. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో విశ్వక్ సేన్ అఘోరాగా కనిపించనున్నాడు. ఇంతకు ముందు బాలయ్య అఖండ సినిమాలో అఘోరాగా కనిపించిన విషయం తెలిసిందే. ఆ సినిమా బ్రహ్మాండమైన విజయాన్ని అందుకుంది. 

Advertisement
CJ Advs

మరి ఇప్పుడా సెంటిమెంట్ విశ్వక్ సేన్‌కు కూడా కంటిన్యూ అవుతుందో లేదో తెలియదు కానీ.. ఫస్ట్ లుక్ పరంగా మాత్రం విశ్వక్ సేన్ అందరినీ మెప్పిస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ని మేకర్స్ వదిలారు. ఇందులో విశ్వక్ అఘోరా గెటప్‌లో కనిపిస్తుండగా.. అతని చుట్టూ చాలా మంది అఘోరాలు అతడిని టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా ఈ పోస్టర్‌లో చూపించారు. ఈ పోస్టర్ చూస్తుంటే డార్క్ మిస్టీరియస్ ఫీలింగ్ కలుగుతోంది. అలాగే His biggest fear, is human touch… His deepest desire, is also human touch అని పోస్టర్‌పై రాసి ఉంది.

ఈ లైన్స్ చూస్తుంటే.. ఇందులో విశ్వక్ సేన్ ఒక ప్రత్యేక వ్యక్తిగా కనిపిస్తాడనేది అర్థమవుతోంది. మేకర్స్ చెబుతున్నదాని ప్రకారం.. అతను ఏ మానవ స్పర్శను అనుభవించలేడని అంటున్నారు. అంటే కచ్చితంగా ఇదొక వైవిధ్యభరిత చిత్రమని చెప్పొచ్చు. అడ్వెంచర్ డ్రామాగా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా విశ్వక్ సేన్‌కి ఎలాంటి పేరును, సక్సెస్‌ను తెస్తుందో చూడాల్సి ఉంది. త్వరలోనే ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు.

Vishwak Sen plays an Aghora Role in Gaami:

Gaami First Look Unveiled
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs