Advertisement
Google Ads BL

నిహారిక పై సింపతీ: మాజీ భర్త చైతన్య ఫైర్


నిహారిక చైతన్య జొన్నలగడ్డకి ఎందుకు విడాకులిచ్చిందో.. అసలు వారు ఎందుకు విడిపోయారో అనేది ఎవ్వరికి తెలియదు. విడాకుల విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించాక నిహారిక తన పని తాను చేసుకుంటుంది. చైతన్య కూడా తన పనిలో బిజీగా మారిపోయాడు. నిహారిక విడాకుల మేటర్ చాలామంది మర్చిపోయారు కూడా. అయితే నిహారిక తాజాగా ఓ యూట్యూబర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విడాకులపై స్పందించింది. అమ్మ నాన్నల్లా అవతలి వారు ప్రేమగా చూసుకోరు, ఒకరినొకరు తెలుసుకుని పెళ్లిళ్లు చేసుకోవాలి, నేను విడాకుల తీసుకున్నాక ఎన్నో అన్నారు, బాధని భరించాను, నా కుటుంబాన్ని నిందించారు.. అంటూ చెప్పిన మాటలను ఓ యూట్యూబర్ పోస్ట్ చేసాడు.

Advertisement
CJ Advs

ఆ యూట్యూబర్ పై నిహారిక మాజీ భర్త చైతన్య ఫైర్ అవుతున్నాడు. నాణానికి ఒకవైపే చూడకూడదు, విడాకులు తీసుకున్నాక ఇద్దరికీ ఆ బాధ ఉంటుంది. అందులో ఒక వెర్షన్ మాత్రమే వినిపించకూడదు, ఇద్దరి మధ్యన విడాకుల తంతు ముగిసాక దాని మీద చర్చించకూడదు, అలాంటిది ఇలాంటి వేదికపై చర్చించడం కరెక్ట్ కాదు, పెళ్లి బంధం ముగిసాక విడాకులు అయ్యాక అందులో నుంచి బయటికి ఎలా వచ్చామో అనేది మాట్లాడొచ్చు, కానీ జరిగింది ఏమిటో తెలుసుకోకుండా ఇలా మాట్లాడడం కరెక్ట్ అనిపిస్తుందా? విషయం పూర్తిగా తెలియకుండా ప్రజలకు అసత్యాలని చేరవెయ్యకండి, ఒక కోణంలోనే జెడ్జ్ చెయ్యకండి, వన్ సైడ్ వర్షన్ చెప్పి అందరిని కన్ఫ్యూజ్ చేయకండి.

విడాకులకు సంబంధించి బాధితురాలి పక్షానే మాట్లాడి, ఆమెకే సింపతీ క్రియేట్ చెయ్యాలని చూస్తే ఎలా, వ్యక్తిగతంగా వ్యవహరించేటప్పుడు ఇలాంటి నెగిటివిటి తట్టుకోవడం చాలా కష్టం. ఇలాంటి వాటి మీద అవగాహన లేకుండా మాట్లాడి ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు, అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాను అంటూ నిహారిక మాజీ భర్త చైతన్య జొన్నలగడ్డ నిహారిక ఫ్రెండ్ కి గట్టిగా ఇచ్చిపడేసాడు. 

Sympathy for Niharika: Ex-husband Chaitanya Fire:

Chaitanya Jonnalagadda Reaction On Niharika Interview
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs