Advertisement
Google Ads BL

తగ్గేదేలే అంటున్న పుష్ప 2 మేకర్స్


పుష్ప 2 విడుదల తేదీపై సందేహాలు మొదలయ్యాయి. పుష్ప ద రూల్ ఆగష్టు 15 న విడుదలవుతుంది అంటూ మేకర్స్ రీసెంట్ గానే రిలీజ్ డేట్ లాక్ చేసి అనౌన్స్ చేసారు. అందుకు అనుగుణంగానే అల్లు అర్జున్-సుకుమార్ లు షూటింగ్ చేస్తూ వస్తున్నారు. అయితే ఈ మధ్యన అల్లు అర్జున్ నడుం నొప్పి కారణంగా పుష్ప 2 షూటింగ్ కి బ్రేకులు పడుతూ రావడంతో.. రిలీజ్ డేట్ మారొచ్చని, ఎన్టీఆర్ దేవర మూవీ ఏప్రిల్ 5 నుంచి ఆగష్టు 15 కి మారితే.. పుష్ప 2 క్రిష్ట్మస్ ని టార్గెట్ చేసే అవకాశముంది అనే టాక్ మొదలైంది.

Advertisement
CJ Advs

అటు పుష్ప 2 షూటింగ్ ఇంకా చాలా బ్యాలన్స్ వుంది. విడుదలకు ఐదు నెలల సమయమే ఉంది, అటు ప్రమోషన్స్ కి కూడా దాదాపుగా నెల రోజులు టైమ్ కావాలి, మరొపక్క పుష్ప కీలక పాత్రధారి జగదీశ్ బెయిల్ పై అనుమానాలు, కాబట్టి పుష్ప ఆగష్టు 15 నుంచి షిఫ్ట్ అవ్వొచ్చనే ఆలోచనలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో ఒకటే న్యూస్ లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం పుష్ప ద రూల్ ని ఎట్టి పరిస్తితుల్లో వాయిదా వేసేదేలే.. అనుకున్న సమయానికే అంటే ఆగష్టు 15 నే విడుదలవుతుంది, సోషల్ మీడియా గాసిప్స్ నమ్మొద్దు అంటూ అల్లు కాంపౌండ్ పుష్ప 2 వాయిదా న్యూస్ పై స్పందించినట్టుగా తెలుస్తోంది.

సుకుమార్-బన్నీ క్లారిటీగా ఉన్నారు, ఇంకా ఐదు నెలల సమయం ఉంది ఏప్రిల్ కల్లా షూటింగ్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ ముగించి జులై కల్లా ప్రమోషన్స్ స్టార్ట్ చేసే ప్లాన్ లో ఉన్నారు, జగదీశ్ కూడా బెయిల్ పై వచ్చి షూటింగ్ చేసుకుని మళ్ళీ వెళ్ళిపోతున్నాడని, అతని భాగాన్ని వీలైనంత వేగంగా తీసేందుకు సుకుమార్ కూడా ప్రయత్నిస్తున్నారట. ఎట్టి పరిస్థితుల్లోనూ పుష్ప 2 పోస్ట్ పోన్ అవదనే సంకేతాలు అల్లు కాంపౌండ్ నుంచి అయితే అందుతున్నాయి.

Pushpa 2: No postponement, on track :

Pushpa 2: No postponement, on track for 15th August 2024
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs