Advertisement
Google Ads BL

మరోసారి డేట్ మార్చేసిన టిల్లు


గత ఏడాదేప్పుడో విడుదల కావాల్సిన సిద్దు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ ఇప్పుడు ఫిబ్రవరి 9 న రాబోతుంది అనుకుంటే.. ఇప్పుడా డేట్ కూడా మార్చేసుకుని కొత్త తేదీని సెట్ చేసుకుంది. డిజె టిల్లు సినిమాతో టిల్లుగా ప్రేక్షకులపై చాలా ఇంపాక్ట్ చూపించాడు సిద్దు జొన్నలగడ్డ. బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో అలరించి, కల్ట్ బ్లాక్‌బస్టర్‌గా పేరు పొందింది.

Advertisement
CJ Advs

టిల్లు స్క్వేర్ సీక్వెల్‌లో సిద్ధు జొన్నలగడ్డను మరోసారి బిగ్ స్క్రీన్‌పై టిల్లుగా చూడటానికి ప్రేక్షకులు ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే టిల్లు స్క్వేర్ కోసం రామ్ మిరియాల స్వరపరిచిన ఆల్బమ్‌లోని టికెట్టే కొనకుండా, రాధిక వంటి పాటలు వైరల్ చార్ట్‌బస్టర్‌లుగా మారాయి. మేకర్స్ కూడా ఒరిజినల్ కు మించిన సీక్వెల్ చేయడానికి తగినంత సమయం తీసుకున్నారు. కొన్ని అనుకోని పరిస్థితుల కారణంగా ఫిబ్రవరి 9న అనుకున్న విడుదలను వాయిదా వేయవలసి రావడంతో ఇప్పుడు మేకర్స్ వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకొని చిత్రాన్ని మార్చి 29న విడుదల చేయాలని నిర్ణయించారు.

డిజె టిల్లు అభిమానులను మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకులను అలరించే టిల్ స్క్వేర్ పై మేకర్స్ గొప్ప నమ్మకాన్ని వ్యక్తం చేశారు. టిల్లు ఫ్రాంచైజీ నుంచి వస్తున్న మరో మెమరబుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉంటుందని గట్టిగా చెప్పవచ్చు. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. సినిమాలోని ఆమె కిల్లర్ లుక్స్ ఇప్పటికే బాగా పాపులర్ అయ్యాయి. 

Tillu Square to release on 29th March! :

Siddhu Jonnalagadda most awaited sequel Tillu Square to release on 29th March! 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs