సుధీర్ బాబు కొద్దిరోజులుగా వరస వైఫల్యాలతో సతమతమవుతున్నాడు. హంట్, మామా మశ్చీంద్ర చిత్రాలు డిజాస్టర్స్ అయ్యాయి. అయితే ఇప్పుడు హరోం హర అంటూ ప్యాన్ ఇండియా ప్రేక్షకులని టార్గెట్ చేస్తున్న సుధీర్ బాబు రవితేజ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రవితేజ-హరీష్ శంకర్ మూవీలో సుధీర్ బాబు విలన్ గా నటిస్తున్నాడేమో అనే ఉహాగానాలు స్టార్ట్ అయ్యాయి.
అయితే ఈ న్యూస్ ని సోషల్ మీడియాలో చూసిన సుధీర్ బాబు అవునా అంటూ ఆశ్చర్యపోతూ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. సుధీర్ బాబు గతంలో హిందీలో విలన్ రోల్ లో కనిపించి అందరిని ఆకట్టుకున్నాడు. ఇప్పుడు రవితేజకి కూడా విలన్ గా మారతాడేమో అంటూ అందరూ ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుకోగా.. సుధీర్ బాబు మాత్రం షాకవుతూ రిప్లై ఇచ్చాడు.