Advertisement
Google Ads BL

కన్నీళ్లు పెట్టుకుంటున్న బిగ్ బాస్ ప్రియాంక


బిగ్ బాస్సీజన్ 7 లో టాప్5 కి వెళ్లిన ప్రియాంక జైన్.. ఈ సీజన్ లో అబ్బాయిలకి టఫ్ ఫైట్ ఇచ్చింది. బిగ్ బాస్ నుంచి బయటికొచ్చాక తన బాయ్ ఫ్రెండ్ శివ ని పెళ్లి చేసుకుని హ్యాపీ గా ఉంటుంది అని అందరూ అనుకున్నారు. అనుకోవడం కాదు.. బిగ్ బాస్ నుంచి బయటికొచ్చాక ప్రియాంక శివతో కలిసి వీడియోస్ చేస్తూ, డాన్స్ చేస్తూ సరదాగానే కనబడింది. కానీ ఇంతలోనే ప్రియాంక కన్నీళ్లు పెట్టుకుంటూ చేసిన వీడియో ఒకటి వైరలయ్యింది.

Advertisement
CJ Advs

అది ప్రియాంక తన తల్లికి క్యాన్సర్ అంటూ చెప్పి అందరికి షాకిచ్చింది. తన తల్లికి క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ అని డాక్టర్స్ చెప్పారని.. ఆమెకి పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, పీరియడ్స్ వచ్చాక 10 నుంచి 15 రోజులపాటు బ్లీడింగ్ అవుతూ ఉండడంతో టెస్ట్ లు చేయించడంతో ఆమెకి క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ అని తేలింది, తన తల్లి తనని బిగ్ బాస్ లో కలిసేందుకు, సపోర్ట్ చేసేందుకు ఆసుపత్రికి వెళ్లకుండా నిర్లక్ష్యం చేసింది అని, తాను బిగ్ బాస్ కి వెళ్లకుండా ఉండి ఉంటే బాగుండేది అని చెప్పిన ప్రియాంక..

ప్రస్తుతం తన తల్లికి వైద్యులు ల్యాప్రోస్కోపి సర్జరీ చేస్తున్నారని, దాని వలన క్యాన్సర్ వ్యాప్తిని ఆపొచ్చని డాక్టర్స్ చెప్పారని, తన తల్లికి రక్తం తక్కువగా ఉండడంతో బ్లడ్ బ్యాంకు లో రక్తం సేకరించి తన తల్లికి ఎక్కించారని, తన తల్లిని ఆపరేషన్ కి తీసుకెళుతున్న వీడియో ని షేర్ చేస్తూ ప్రియాంక కన్నీళ్ల పర్యంతమైంది. తమలా ఎవరూ ఇలా ఆసుపత్రికి వెళ్లకుండా నిర్లక్ష్యం చెయ్యొద్దు అని చెప్పుకొచ్చింది. 

Bigg Boss Priyanka is in tears:

Priyanka Jain reveals her mother first stage cancer
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs