ఇప్పుడు త్రివిక్రమ్ ముందు స్టార్ హీరోల ఆప్షన్ లేదా అంటే సోషల్ మీడియాలో లేదు అనే న్యూస్ లే దర్శనమిస్తున్నాయి. అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్ ని ఎవ్వరూ నమ్మలేదు. నితిన్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వరసగా సినిమాలు చేసారు. అయితే ఇప్పుడు గుంటూరు కారం సినిమా రిజల్ట్ తర్వాత త్రివిక్రమ్ పై మహేష్ అభిమానులే కాదు.. గుంటూరు కారం చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇది త్రివిక్రమ్ తీసిన సినిమానేనా.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ కానీ, కామెడీ కానీ లేదు అంటూ వెటకారంగా మాట్లాడుతున్నారు.
త్రివిక్రమ్ కి గుంటురు కారం టాక్ తర్వాత స్టార్ హీరోలు ఎవ్వరూ డేట్స్ ఇవ్వరనే ప్రచారం మొదలైంది. అసలైతే అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్ చేసారు. అది ఇప్పుడు హోల్డ్ లో పెట్టరేమో అనే ఊహాగానాలు మొదలయ్యాయి. మరోపక్క త్రివిక్రమ్ ముందు ఉన్న ఆప్షన్స్ హీరో రామ్, విజయ్ దేవరకొండ, నాని అనే మాట వినిపిస్తోంది. అంటే స్టార్ హీరోల ఛాన్స్ లు లేవు, కేవలం మీడియం రేంజ్ హీరోలతో త్రివిక్రం తదుపరి సినిమా మొదలు పెట్టుకోవాలనే మాట వినిపిస్తోంది.
మరి నిజంగానే గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ రేంజ్ అంతగా తగ్గిపోయిందా.. స్టార్ హీరోలెవరూ త్రివిక్రమ్ కి ఛాన్స్ ఇచ్చేందుకు సుముఖంగా లేరా అని త్రివిక్రమ్ సినిమాలు ఇష్టపడేవారు మధనపడుతున్నారు.