Advertisement
Google Ads BL

4 పార్టీలు.. 2 ఫ్యామిలీలు.. ఏపీ అంటార్రా బాబూ


వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాక అక్కడి రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఆమె బాధ్యతలు చేపట్టారు. ఈక్రమంలోనే సోషల్ మీడియాలో ఒక న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఏపీలో రాజకీయ పార్టీల అధినేతలపై ఒక ఆసక్తికర కథనం సర్క్యులేట్ అవుతోంది. ఏపీ రాజకీయాలన్నీ కేవలం రెండు కుటుంబాల మధ్యే తిరుగుతున్నాయి. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఏపీలో నాలుగు స్తంభాలాట జరుగుతోంది. అంటే నాలుగు పార్టీలకు అధినేతలు వచ్చేసి రెండు కుటుంబాలకు చెందిన వారే కావడం గమనార్హం. నారా, నందమూరి కుటుంబాలు ఎన్టీఆర్ కుటుంబానికి చెందినవి.

Advertisement
CJ Advs

సొంత అన్నపైనే యుద్ధం..

ఇక వైసీపీ, కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నవారిద్దరూ వైఎస్ కుటుంబానికి చెందినవారు. ఈ నలుగురి చుట్టే ప్రముఖంగా రాజకీయాలు తిరుగుతున్నాయి. నారా చంద్రబాబునాయుడు వచ్చేసి టీడీపీకి అధినేతగా ఉన్నారు. పురందేశ్వరి వచ్చేసి బీజేపీ చీఫ్‌గా ఉన్నారు. ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఆయన కూతురు కూడా రాజకీయ రంగ ప్రవేశం చేసింది. వైఎస్ కుమారుడు జగన్ వచ్చేసి వైఎస్సార్‌సీపీని ఏర్పాటు చేసి ఆ పార్టీ అధినేతగా.. అలాగే ఏపీ సీఎంగా ఉండగా.. ఆయనను అధికారం నుంచి దించేందుకు సోదరి షర్మిల వచ్చేసి కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టారు. సొంత అన్నపైనే యుద్ధం ప్రకటించేశారు. 

ఏపీలో వింత రాజకీయాలు..

ఇలా సొంత కుటుంబ సభ్యులే ప్రత్యర్థులుగా ఉండటం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వైఎస్ జగన్‌ను గద్దె దింపడమే లక్ష్యంగా ఆయన సోదరి సహా మిగిలిన పార్టీలన్నీ పని చేస్తున్నాయి. రాజకీయిల్లో బంధుత్వానికి తావు లేదు అనడానికి ఏపీయే నిదర్శనం. రానున్న ఎన్నికల్లో ఆసక్తికర పోరును అయితే చూడబోతున్నాం. ఏపీలో వింత రాజకీయాలు పేరిట న్యూస్ అయితే తెగ వైరల్ అవుతోంది. న్యూసే ఇంత వైరల్ అయితే ఎన్నికల సమరం ఇంకెంత ఇంట్రస్టింగ్‌గా ఉండబోతోందోనని టాక్ నడుస్తోంది. 2024 ఎన్నికలలో ఏపీలో డబుల్ ధమాకా ఇవ్వడనికి వైస్ కుటుంబం, నందమూరి కుటుంబం సిద్దముగా ఉందంటూ సోషల్ మీడియాలో రకరకాల న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి.

4 parties.. 2 families.. AP politics:

AP politics revolve around two families with four parties
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs