ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ ఇమేజ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఊహించనంతగా ఉంది.. అది SSMB29 తో మరింతగా పెంచే బాధ్యత తమది, ఈ ఒక్క సినిమాతోనే ప్యాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు రావాలని తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని రాజమౌళి తండ్రిగారు విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలను మహేష్ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. గుంటూరు కారం హడావుడి ఫినిష్ అవడంతో మహేష్ బాబు ఎప్పుడెప్పుడు రాజమౌళి తో సినిమా సెట్స్ లోకి అడుగుపెడతాడా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
తాజాగా విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో SSMB29 పై చాలా విషయాలు రివీల్ చేసారు. SSMB29 ఇండియానా జోన్స్ మాదిరి ఉండబోతుంది అని, భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్ర కథ అడవుల నేపథ్యంలో ఉండబోతుంది, అలాగని పిరియాడికల్ డ్రామా కాదని, ఇంకా ఈ చిత్రానికి టైటిల్ ఖరారు చెయ్యలేదు అని చెప్పారు, ప్రస్తుతం సంగీతం పై చర్చలు జరుగుతున్నాయని చెప్పారాయన. ఈ ఒక్క చిత్రంతోనే మహేష్ కి ప్యాన్ ఇండియాలో భారీగా స్థాయి గుర్తింపు రావాలని, అందుకు తగ్గట్టుగా ప్రయత్నం చేస్తున్నామని చెబుతూ SSMB29 ప్రాజెక్ట్ పై అంచనాలు పదింతలు చేసేసారు.