యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవర ప్యాన్ ఇండియా మూవీలో విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ అనారోగ్య కారణాలతో హస్పిటల్‌లో చేరారు. ఆయనకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తడంతో కుటుంభ సభ్యులు కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్‌లో చేర్చారు. అయితే సైఫ్ అనారోగ్యం పాలవడానికి కారణం దేవర షూటింగ్ లో గాయపడడమే అని తెలుస్తోంది. దేవర సెట్స్ లో గాయపడటంతో సైఫ్‌కు ట్రసెప్ సర్జరీ నిర్వహించారు. ఆ సర్జరీ తర్వాత ఆయన మీడియాకు తన హెల్త్ అప్ డేట్ ఇచ్చారు.
దేవర సినిమాలో కీలక యాక్షన్ సీన్ల చిత్రీకరణ సందర్భంగా సైఫ్ అలీ ఖాన్ కి గాయం కాగా.. వైద్యులు సర్జరీ చేశారు. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో సర్జరీ చాలా సేఫ్ జరిగింది. నా ఆరోగ్యం కోసం ఎవరూ ఆందోళన చెందవద్దు, నా గురించి, నా క్షేమం గురించి ప్రార్థించిన వారికి ధన్యవాదాలు అంటూ సైఫ్ అభిమానులకి థాంక్స్ చెప్పాడు. త్వరలోనే సైఫ్ అలీ ఖాన్ ఆసుపత్రి నుంచి డిశ్ ఛార్జ్ చేసారని తెలుస్తోంది. ప్రస్తుతం దేవరలో సైఫ్ అలీ ఖాన్ సీన్స్ కి బ్రేకులు పడ్డాయి.