వెంకటేష్-శైలేష్ కొలను కలయికలో #Venky75 గా తెరకెక్కిన సైంధవ్ మూవీ సంక్రాంతి సందర్భంగా గుంటూరు కారం, హనుమాన్, నా సామిరంగా సినిమాలతో పోటీ పడింది. అయితే మిగతా మూడు సినిమాలు పండగ వైబ్స్ ని చూపించగా.. సైంధవ్ మాత్రం డిఫరెంట్ జోనర్ లో కనిపించింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన సైంధవ్ ని ప్రేక్షకులు లైట్ తీసుకున్నారు. మిగతా మూడు సినిమాలని ఆదరించిన ప్రేక్షకులు సైంధవ్ ని మాత్రం పట్టించుకోలేదు.
దానితో వెంకీ కి తీపి గుర్తుగా ఉండిపోవాల్సి ఈ సైంధవ్ చిత్రం ప్లాప్ గా మిగిలిపోయింది. ఇక జనవరి 13 న థియేటర్స్ లో విడుదలైన సైంధవ్ ఓటిటి డేట్ పై అందరిలో ఆసక్తి మొదలయ్యింది. సైంధవ్ డిజిటల్ హక్కులని ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకోగా.. సైంధవ్ స్ట్రీమింగ్ ని ఫిబ్రవరి 2 కానీ లేదంటే ఫిబ్రవరి 9 కానీ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అంటే సైంధవ్ థెటర్స్ లో విడుదలై నెల కాక ముందే ఓటిటిలోకి వచ్చేస్తుంది.