యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో ప్యాన్ ఇండియా ఫిలిం గా తెరకెక్కుతున్న దేవర మూవీ పై భీభత్సమైన అంచనాలున్నాయి. సంక్రాంతి ఫెస్టివల్ ముందు వదిలిన దేవర గ్లిమ్ప్స్ మరిన్ని అంచనాలు పెరిగేలా చేసింది. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ లుక్ ని ఫస్ట్ లుక్ అండ్ గ్లిమ్ప్స్ తోనే ఫాన్స్ అంచనాలు అందుకునేలా డిజైన్ చేసారు. అయితే తాజాగా ఈ చిత్రంపై ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అది దేవర ఇంటర్వెల్ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ క్యారెక్టర్ గురించి ఓ సర్ ప్రైజింగ్ ట్విస్ట్ రివీల్ అవుతుందని తెలుస్తోంది.
ఈ ఇంటర్వెల్ ట్విస్ట్ సినిమా మొత్తానికే హైలైట్ గా నిలవనుంది అని తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ ప్రత్యేకంగా పూర్తిగా రఫ్ అండ్ రగ్గుడ్ లుక్ లో కనిపిస్తాడని అంటున్నారు. దేవర తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ అవుతుండగా.. దేవర డిజిటల్ హక్కులని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఆ విషయాన్ని రీసెంట్ గానే నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్ తో తలపడబోతున్న విలన్ గా నటిస్తున్నారు.