Advertisement
Google Ads BL

డీవీవీకి ఈ శనివారం సరిపోయింది


ఆర్ఆర్ఆర్ చిత్ర నిర్మాణ సంస్థ డివీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై న్యాచురల్ స్టార్ నాని హీరోగా సరిపోదా శనివారం అంటూ ఓ యాక్షన్ ప్యాక్డ్ సినిమా తెరకెక్కుతోంది. ప్రకటన వీడియో నుండే మంచి అంచనాలను క్రియేట్ చేసుకున్న ఈ సినిమా నిర్మాణ సంస్థకి ఈ వారం ఓ న్యూస్ దొరికింది. సోషల్ మీడియాలో డీవీవీ జరిపిన సంభాషణతో ఈ శనివారం డీవీవీకి సరిపోయింది అనేలా.. నెటిజన్లు కామెంట్స్ చేసుకుంటున్నారు. ఇంతకీ ఆ సంభాషణ ఏమిటని అనుకుంటున్నారా? 

Advertisement
CJ Advs

ఈ శనివారం సరిపోదా శనివారం నుండి ఓ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ దిల్ రాజు‌కు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) సొంతం చేసుకుందని చెప్పడానికి ముందు కాసేపు రెండు సంస్థలు సోషల్ మీడియాలో సంభాషించుకున్నాయి. అదేమంటే చెప్పేద్దామా? అని డీవీవీ సంస్థ, లేదు రాహుకాలం తర్వాత చెబుదామని ఎస్‌విసి సంస్థ ట్వీట్స్ చేయడంతో.. ఏదో అప్‌డేట్ వస్తుందని అంతా అనుకున్నారు కానీ.. ఇది రైట్స్‌కి సంబంధించినది అని తెలిసి.. దీనికా ఇంత హడావుడి చేశారు అంటూ నెటిజన్లు కామెంట్స్ మొదలెట్టారు. 

మొత్తంగా ఈ డీవీవీకి ఈ శనివారం సరిపోయిందనేలా పడుతున్న కామెంట్స్‌తో సరిపోదా శనివారం ట్యాగ్ నెట్టింట్లో ట్రెండ్ అవుతూ ఉంది. ఇక రైట్స్ విషయంతో పాటు, ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోందని, వెర్సటైల్ యాక్టర్ ఎస్ జే సూర్య ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారని, ఆయన షూటింగ్‌లో కూడా జాయిన్ అయ్యారనే అప్‌డేట్‌ని కూడా డీవీవీ సంస్థ ప్రకటించింది. న్యాచురల్ స్టార్ నాని సరసన ఇందులో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకుడు.

Saripodhaa Sanivaaram AP and Telangana Rights Bagged by SVC:

Saripodhaa Sanivaaram Latest Update      
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs