Advertisement
Google Ads BL

బింబిసార సీక్వెల్‌కు నేను కాదు: వశిష్ఠ


నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో వచ్చిన బింబిసార సినిమా ఎలాంటి విజయాన్ని నమోదు చేసిందో తెలియంది కాదు. చాలా గ్యాప్ తర్వాత కళ్యాణ్ రామ్‌కి ఈ సినిమా హిట్‌ని ఇచ్చింది. ఇందులో కళ్యాణ్ రామ్ డబుల్ యాక్షన్, కథా నేపథ్యం, దర్శకత్వం.. అన్నీ కూడా ప్రేక్షకులకి విపరీతంగా నచ్చేశాయి. అందుకే ఈ సినిమాకు బ్రహ్మాండమైన విజయాన్ని ప్రేక్షకులు అందించారు. అయితే బింబిసార చివరిలో ఇచ్చిన ట్విస్ట్‌తో బింబిసార 2పై ఆసక్తి క్రియేట్ అయింది. ఎప్పుడెప్పుడు పార్ట్ 2 వస్తుందా? అని అంతా ఎదురు చూస్తున్న సమయంలో దర్శకుడు వశిష్ఠ ఓ బాంబ్ పేల్చారు.

Advertisement
CJ Advs

బింబిసార పార్ట్ 2 చిత్రం నా దర్శకత్వంలో కాదు. నేను ఆ చిత్రానికి దర్శకత్వం చేయడం లేదు. ఆ మూవీ విషయంలో నా ఊహ వేరుగా ఉంది. అయితే ఈ లోపు నాకు మెగాస్టార్ చిరంజీవిగారితో విశ్వంభర అవకాశం వచ్చింది. విశ్వంభర విషయం కళ్యాణ్ రామ్‌గారికి కూడా చెప్పాను. ఆయన అనుమతి తీసుకునే బింబిసార పార్ట్ 2 నుండి బయటికి వచ్చాను అని చెప్పారు. 

మరి విశ్వంభర తర్వాత ఏమైనా అవకాశం ఉంటుందా? అప్పటి వరకు కళ్యాణ్ రామ్ ఆ ప్రాజెక్ట్‌ని హోల్డ్‌లో పెడతారా? లేక వేరే దర్శకునితో పట్టాలెక్కిస్తారా? అనేది తెలియాలి. ప్రస్తుతం కళ్యాణ్ రామ్‌కి కూడా హిట్టు కావాలి. విశ్వంభర ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.. అలాగే వచ్చే సంక్రాంతికి విడుదల అని తేదీ కూడా ఫిక్స్ చేశారు కాబట్టి.. ఈ లోపు కళ్యాణ్ రామ్ కమిట్‌మెంట్స్ పూర్తి చేసుకుంటే.. వచ్చే సంవత్సరం వీరిద్దరి కాంబినేషన్‌లోనే బింబిసార పార్ట్ 2 వచ్చే అవకాశం అయితే లేకపోలేదు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..

Vassishta Clarity About Bimbisara Part 2:

 I Am not Director to Bimbisara Part 2 Says Vassishta
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs