Advertisement
Google Ads BL

హనుమాన్‌పై మంచు మనోజ్ ట్వీట్


సంక్రాంతికి వచ్చిన నాలుగు సినిమాలలో తేజ సజ్జా నటించిన హనుమాన్ సినిమా యునానిమస్‌గా హిట్ టాక్‌ని సొంతం చేసుకుంది. ఈ సినిమా విజయానికి అన్ని ఇండస్ట్రీలు దాసోహం అవుతున్నాయి. కన్నడ, మలయాళం, తెలుగు, హిందీ.. ఇలా విడుదలైన అన్ని భాషలలోనూ హనుమాన్ అఖండ విజయం దిశగా దూసుకెళుతోంది. సినిమా చూసిన వారు ప్రశంసలు కురిపిస్తుంటే.. చూడని వారు ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా చూసిన వారు.. అందులోని కంటెంట్‌ అద్భుతం అంటూ పొగిడేస్తున్నారు. తాజాగా మంచు మనోజ్ ట్విట్టర్ వేదికగా  ఈ సినిమాని, హీరో తేజ సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మను పొగడ్తలతో ముంచెత్తాడు.

Advertisement
CJ Advs

ఇంద్ర సినిమాతో నాకు, హనుమాన్ సినిమాతో మా అబ్బాయ్ ధైర్యవ్‌కి గూజ్‌బంప్స్ తెప్పించావ్ కదా తమ్ముడు తేజ సజ్జా. కిల్లర్ పెర్ఫార్మెన్స్. ఇరగ్గొట్టేశావ్. 28 సంవత్సరాలకే రెండు జనరేషన్స్‌ని కవర్ చేశావ్. ఒకే ఒక్కడు ప్రశాంత్ వర్మ నుండి వచ్చిన అద్భుతమైన చిత్రమిది. బ్రదర్ ప్రశాంత్ వర్మ.. నిన్ను చూసి చాలా గర్వంగా ఉంది.. అంటూ మంచు మనోజ్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. 

ఒక్క మంచు మనోజ్ అనే కాదు.. బాలయ్య, రవితేజ, రామ్, శివరాజ్ కుమార్.. ఇలా సినిమా చూసిన ప్రతి ఒక్కరూ.. ఇదొక కళాఖండం అంటూ రియాక్ట్ అవుతున్నారు. జనవరి 12న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఇంకా హౌస్‌ఫుల్ బోర్డులతో థియేటర్లలో రన్ అవుతోంది. లిమిటెడ్ థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పటికే రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి.. హిస్టరీని క్రియేట్ చేసింది.

Manchu Manoj Reaction on HanuMan:

Manchu Manoj Spellbounded with HanuMan Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs