దర్శకుడు మారుతి దర్శకత్వంలో ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం యొక్క ఫస్ట్ లుక్ టైటిల్ రెండూ ఈ సంక్రాంతికి విడుదల చేసారు. మారుతి షూటింగ్ లో ప్రభాస్ ఎప్పటినుంచో పాల్గొంటున్నా ఇప్పటివరకు ఈ చిత్రంపై అధికారిక అప్ డేట్ లేదు. ప్రభాస్ ఫాన్స్ కి భయపడిన మారుతి ప్రభాస్ తో షూటింగ్ ని గుట్టు చప్పుడు కాకుండా చేసుకుంటున్నా మధ్యలో లీకులు మారుతి చిత్రంపై ఊహాగానాలు పెరిగేలా చేసింది. ఇక తాజాగా ది రాజాసాబ్ అంటూ ప్రభాస్ ఇంట్రెస్టింగ్ లుక్ ని రివీల్ చేసారు.
లాంగ్ హెయిర్తో, టీ షర్ట్, పూల లుంగీతో ప్రభాస్ చాలా కూల్ గా, స్టైలిష్ గా కనిపించాడు. ప్రభాస్ రాజా సాబ్ లుక్ అభిమానులని ఇంప్రెస్స్ చేసింది. అయితే రాజాసాబ్ చిత్రం మొదటి నుంచి హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది అనే ప్రచారమే ఉంది. కానీ IMDB వెబ్సైట్ లో రాజాసాబ్ ప్రేమలో పడిన ఓ జంట చుట్టూ తిరిగే కథ అంటూ ప్రచురించారు. అది చూసిన మారుతి ఫన్నీగా రియాక్ట్ అయ్యాడు. అరెరే నాకు ఈ ఫ్లాట్ తెలియదు. అందుకని వేరే కథతో షూటింగ్ చేస్తున్నా. ఇప్పుడు IMDB సమాజం దీన్ని యాక్సెప్ట్ చేస్తుందా? మరి (Ararare I don't know this plot So shooting with different script Ippudu IMDB Samajam accept chestada mari 😁) అంటూ వెటకారంగా రియాక్ట్ అయ్యాడు.
మారుతి ఇప్పడు సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ వైరల్ అవ్వగా.. అసలు రాజాసాబ్ గురించిన ఎలాంటి క్లూ తెలియకుండా IMDB ఇలా ఎలా ప్రచురిచిందా అని అందరూ అనుకుంటున్నారు.