Advertisement
Google Ads BL

అప్పుడేమో కానీ ఇప్పుడు పొగుడుతున్నారు


రాకేష్ మాస్టర్ బెస్ట్ కొరియోగ్రఫర్. ఆయన శిష్యులుగా ఈ రోజు శేఖర్ మాస్టర్ టాలీవుడ్ టాప్ స్టార్స్ కి డాన్స్ మాస్టర్ అవ్వగా.. సత్య మాస్టర్ బెస్ట్ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. ఢీ డాన్స్ షో తో వెలుగులోకి వచ్చిన రాకేష్ మాస్టర్ జీవితంలో ఎన్నో కాంట్రవర్సీలు, ఏదైనా ఓపెన్ గా మాట్లాడి అందరి చేత తిట్లుతినే రకం ఆయన. లైఫ్ లో చేసిన తప్పిదాలతో తాగుడుకు బానిసై చివరిలో అనాథలా కన్నుమూశారు. రాకేష్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా అందరికి సుపరిచితుడే. ఆయన పెళ్లిళ్లు, వివాహ జీవితం, కెరీర్ అన్ని వివాదాస్పదమే. అయితే గత ఏడాది రాకేష్ మాస్టర్ అనుకోకుండా కన్నుమూశారు.

Advertisement
CJ Advs

అయితే రాకేష్ మాస్టర్ ఉన్నప్పుడు ఎవరు ఆయన్ని పొగిడారో తెలియదు కానీ.. ఆయన చనిపోయాక ఇన్నాళ్ళకి రాకేష్ మాస్టర్ ని తెగ పొగుడుతున్నారు. కారణం రాకేష్ మాస్టర్ నటించిన హనుమాన్ హిట్ అవడమే. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా నటించిన హనుమాన్ చిత్రంలో రాకేష్ మాస్టర్ గుర్తుండిపోయే నెగెటివ్ కేరెక్టర్ ప్లే చేసారు. ఆయన ఆ కేరెక్టర్ లో నటించలేదు జీవించారు. ఆయన చనిపోయాక విడుదలైన హనుమాన్ సూపర్ హిట్ అవడంతో రాకేష్ మాస్టర్ ని, ఆయన నటనని పొగుడుతున్నారు.

అప్పట్లో అసహ్యహించుకున్నవాళ్ళే ఇప్పుడు రాకేష్ నటన నచ్చి పొగుడుతున్నారు. ఆయన బ్రతికి ఉంటే ఈ కేరెక్టర్ లో బాగా నటించినందుకు గాను మరిన్ని సినిమా అవకాశాలొచ్చేవి అంటున్నారు. అది నిజమే. 

Late Rakesh Master surprise role in HanuMan!:

Rakesh Master plays a Negative Role in Hanuman movie considering as his last movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs