Advertisement
Google Ads BL

లుంగీ ఎత్తిపట్టి.. ప్రభాస్ పొంగల్ ఫీస్ట్!


రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఈ సంక్రాంతికి డబుల్ ట్రీట్ వచ్చేసింది. ఎర్లీ మార్నింగ్ కోడి కూసే సమయానికి, చీకటిని తరిమికొడుతూ సూర్యుడు నిద్రలేచే వేళకి డబుల్ ట్రీట్‌తో సిద్ధమయ్యాడు ప్రభాస్. ఇంతకీ డబుల్ ట్రీట్ ఏంటని అనుకుంటున్నారా? పై పోస్టర్ చూస్తుంటే అర్థం కావడంలా? ప్రభాస్ పొంగల్ ఫీస్ట్‌ని ఎలా ప్లాన్ చేశాడో? ప్రభాస్ హీరోగా.. భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, ప్రతిరోజు పండగే వంటి చిత్రాలతో దర్శకుడిగా తనేంటో నిరూపించుకున్న మారుతి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. 

Advertisement
CJ Advs

గుట్టుచప్పుడు కాకుండా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా మొదలైనప్పటి నుండి కొన్ని లీకైన ఫొటోస్ తప్పితే.. అధికారిక సమాచారం ఇంత వరకు మేకర్స్ నుండి రాలేదు. పొంగల్‌ను పురస్కరించుకుని రెండు రోజుల క్రితమే ప్రకటించారు. టైటిల్, ఫస్ట్ లుక్‌తో పొంగల్ రోజు ప్రభాస్ ట్రీట్ ఇవ్వబోతున్నాడని మేకర్స్ తెలియజేశారు. ఇక మొదటి నుండి వినబడుతున్నట్లుగా ఈ సినిమా టైటిల్ రాజా డీలక్స్ కాదు.. టైటిల్‌లో రాజా ఉంది కానీ.. డీలక్స్‌ని లేపేశారు. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్‌లా.. ఈ సినిమాకు ది రాజా సాబ్ అనే టైటిల్‌ని ఫిక్స్ చేస్తూ.. వదిలిన ఫస్ట్ లుక్‌లో ప్రభాస్ అరాచకం అంతే.

ఎందుకంటే, ఇప్పటి వరకు ప్రభాస్ అనగానే అందరూ ఊర మాస్ అవతార్‌ని చూపించారు. కానీ ఫస్ట్ టైమ్ మారుతి మార్క్ ప్రభాస్ కనిపిస్తున్నారు. రెండు చేతులతో లుంగీ ఎత్తిపట్టుకుని, నవ్వుతూ ప్రభాస్ వస్తున్న తీరు చూస్తుంటే.. మారుతి చాలా గట్టిగానే ప్లాన్ చేశాడనేది అర్థమవుతోంది. ఇప్పటి వరకు ప్రభాస్‌ని ఇలా అయితే చూడలేదు. అందుకే సోషల్ మీడియాలో ఈ లుక్ వైరల్ అవుతూ దుమ్ము రేపుతోంది. ఈ ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ని భీమవరంలో భారీ కటౌట్‌తో రివీల్ చేసి.. ఫస్ట్ లుక్‌తోనే  డైనోసార్ డార్లింగ్ ఫ్యాన్స్‌‌ని ఖుషి చేశారు. ది రాజా సాబ్‌ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూఛిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రభాస్ తన ఇన్‌స్టా వేదికగా ఈ పోస్టర్ వదిలి.. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.

Prabhas Pongal Feast The Raja Saab First Look Out:

Prabhas and Maruthi Film Tile The Raja Saab
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs