Advertisement
Google Ads BL

త్రివిక్రమ్ ని నమ్మడం మానెయ్యండి


త్రివిక్రమ్ ని నమ్మి ఆయన కథ చెప్పకుండానే కొంతమంది హీరోయిన్స్ ఆయన చేసే సినిమాల్లో సెకండ్ హీరోయిన్ పాత్రలకి ఒప్పుకుంటున్నారా.. లేదంటే స్టార్ హీరోలని చూసి ఒకటి రెండు షాట్స్ లో కనిపించినా క్రేజ్ వస్తుంది అని ఒప్పుకుంటున్నారా.. కాదు స్టార్ డైరెక్టర్ చిన్న రోల్ ఇచ్చినా చాలు అని త్రివిక్రమ్ అడగ్గానే ఆయన్ని నమ్మి సెకండ్ కేరెక్టర్స్ చెయ్యడానికి ఒపుకుంటున్నారా.. అనేది ఇప్పుడు చాలామంది మదిలో మెదులుతున్న ప్రశ్న. అరవింద్ సమేతలో సెకండ్ హీరోయిన్ గా కనిపించిన ఈషా రెబ్బ ఆ చిత్రంలో ఎన్టీఆర్ తో ఒకటి రెండు సీన్స్ కి పరిమితమైంది.

Advertisement
CJ Advs

ఇక అల వైకుంఠపురములో అల్లు అర్జున్ కి సెకండ్ హీరోయిన్ గా వచ్చిన నివేద పేతురేజ్ కూడా ఒకటి రెండుసార్లు కనిపించి మాయమైంది. ఇప్పుడు గుంటురు కారంలో మీనాక్షి చౌదరి కూడా మహేష్ కి మందులోకి ఆమ్లెట్ వెయ్యడానికి ఉన్నట్టుగా ఒకటి రెండు సన్నివేశాలకి పరిమితం చేసారు. త్రివిక్రమ్, మహేష్ అడగ్గానే ఒప్పేసుకున్న మీనాక్షి చౌదరి.. త్రివిక్రమ్ ని నమ్మిందా, మహేష్ సినిమా అని చిన్న రోల్ అయినా ఒప్పుకుందా అనేది అందరిలో కలిగిలిన అనుమానం. 

గుంటూరు కారంలో మీనాక్షి చౌదరికి ఇచ్చిన డైలాగ్స్, ఆమె సీన్స్ ఇవే.. మహేష్ బాబుకి అన్నం ప్లేటు తెచ్చివ్వడం, మహేష్ ఇంటికి రాగానే అమ్మకు చెప్పడం, మహేష్ డ్రింక్ చేస్తుంటే ఆమ్లెట్ ప్లేట్ అందివ్వడం,  మావయ్య జయరాంతో బావ బయట అందరిని కొడుతున్నాడని కంప్లయింట్ చేయడం.. ఇది మీనాక్షి కేరెక్టర్ కి త్రివిక్రమ్ ఇచ్చిన ప్రాధాన్యత. 

హీరోయిన్స్ మీరు ఇకపై త్రివిక్రమ్ ని నమ్మడం మానెయ్యండి అంటూ పూనమ్ లాంటి హీరోయిన్స్ గురూజీని టార్గెట్ చేస్తున్నారు. అలాంటి కేరెక్టర్స్ చెయ్యకపోయినా పోయేదేమీ ఉండదు, త్రివిక్రమ్ అని సినిమా ఒప్పుకుంటే ఇలాంటి మాటలే వినాల్సి వస్తుంది.. 

Stop believing Trivikram:

Meenakshi is just a replacement in Guntur Kaaram
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs