Advertisement
Google Ads BL

బెంగుళూరు ఫామ్ హౌస్ కి మెగా వారసురాలు


మెగాస్టార్ చిరంజీవికి బెంగుళూరులో ఓ ఫామ్ హౌస్ వుంది. అక్కడే చిరు తన చిన్న కుమార్తె శ్రీజకి రెండో పెళ్లి చేసారు. కళ్యాణ్ దేవ్ కి శ్రీజకి బెంగుళూరు ఫామ్ హౌస్ లో మెగా కుటుంబం నడుమ అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. ఇప్పుడు అదే ఫామ్ హౌస్ కి మెగా ఫ్యామిలి వెడుతుంది. అది కూడా సంక్రాంతి సెలెబ్రేషన్స్ కోసం. మెగాస్టార్ మానవరాలు మెగా కుటుంబంలోకి అడుగుపెట్టాక వినాయకచవితి పూజని మెగా స్టార్ ఇంట్లోనే నిర్వహించారు.

Advertisement
CJ Advs

ఇప్పుడు సంక్రాంతి వేడుకల కోసం మెగాస్టార్ మనవరాలు క్లింకారతో సహా రామ్ చరణ్, ఉపాసనలు ఈరోజు బెంగుళూరు వెళ్లిన ఎయిర్ పోర్ట్ పిక్స్, వీడియోస్ వైరల్ గా మారాయి. రామ్ చరణ్ తన కూతురు క్లింకారాని ఎత్తుకుని నడుస్తూ ఉండగా.. ఉపాసన తమ పెట్ డాగ్ రైమ్ ని ఎత్తుకుని కనిపించారు. ఇక మెగా ఫ్యామిలీ కూడా సంక్రాంతి సెలెబ్రేషన్స్ ని మానవరాలితో సహా బెంగుళూరులో చేసుకోబోతున్నారని తెలుస్తోంది. మూడురోజుల పాటు చరణ్, ఉపాసన ఇంకా మెగా ఫ్యామిలీ మెంబెర్స్ బెంగుళూరు ఫామ్ హౌస్ లోనే గడపబోతున్నట్టుగా తెలుస్తోంది. 

ఇప్పటివరకు మెగా మనవరాలు క్లింకార దర్శనభాగ్యం అభిమానులకి కలగలేదు. ఆ ముహూర్తం ఎప్పుడు పెడతారో అనేది మెగా ఫాన్స్ కి చాలా క్యూరియాసిటీగా ఉంది.

Ram Charan,Upasana head to Bengaluru:

Ram Charan, Upsana snapped at Bengaluru Airport
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs