Advertisement
Google Ads BL

పెంచిన రేట్లు కొంపముంచేలా ఉన్నాయి


బడ్జెట్ మితిమీరి పెట్టడం.. దానిని రాబట్టుకోవడానికి టికెట్ రేట్లు పెంచమని ప్రభుత్వాలని కోరడం.. వాళ్ళు కూడా సినిమా ఇండస్ట్రీ తో స్నేహం కోసం టికెట్ రేట్లు పెంచడం ఇదంతా ఎప్పటినుంచో జరుగుతున్న తతంగమే. అయితే టికెట్ రేట్స్ పెంచినా అభిమానులు థియేటర్స్ కి వెళతారు. అది హిట్ అయితే రిపీటెడ్ గా వెళతారు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా హిట్ సినిమాని చూడడానికి టికెట్ రేట్లు ఎంతైనా పెట్టి థియేటర్స్ కి వస్తారు. అదే సినిమా టాక్ తేడా కొడితే అభిమానులు కూడా ఒక్కసారితో ఆగిపోతారు. రెండోసారి చూద్దామన్నా అంత టికెట్ ధర పెట్టుకుని వెళ్ళాలా అని ఆలోచిస్తారు.

Advertisement
CJ Advs

మల్టీప్లెక్స్ లే కాదు, సింగిల్ స్క్రీన్స్ కి కూడా రేట్లు పెంచేసి సినిమాలు విడుదల చేస్తున్నారు. అదే బెన్ ఫిట్ షోస్ కి స్పెషల్ గా టికెట్ రేట్లు పెంచినా అది ఇష్టమైన అభిమానులు ఎంత రేటైనా పెట్టి సినిమా చూస్తారు. కానీ మిగతా షోస్ కి కూడా పెంచితే.. అదే ఇప్పుడుకొంప ముంచేలా కనిపిస్తుంది. అంటే టాక్ యావరేజ్ అయినా సెలవలకి కుటుంభ ప్రేక్షకులు క్యూ కడతారు. కానీ సామాన్య ప్రేక్షకులు ఫ్యామిలీ మొత్తం థియేటర్ కి వెళితే చాలా వెచ్చించాల్సి వస్తుంది. 

ఇప్పుడు మహేష్-త్రివిక్రమ్ కలయికలో నిన్న విడుదలైన గుంటురు కారం కి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకి టికెట్ రేట్స్ పెంచమని నిర్మాతలు రెండు రాష్ట్ర ప్రభుత్వాలని అడగడం, వారు పెంచుకోమని చెప్పడం జరిగిపోయింది. ఇప్పుడు పెంచిన రేట్లతో మిక్స్డ్ రెస్పాన్స్ రాబట్టుకున్న గుంటూరు కారం సినిమాకి ప్రేక్షకులు ఎంతవరకు ఓటేస్తారు.. ఒకవేళ టికెట్ ధర తగ్గిస్తే.. ఆడియన్స్ కదులుతారు, కానీ నిర్మాతలు అందుకు సిద్ధంగా ఉండాలిగా,  మరోపక్క మిగిలిన సైంధవ్, హనుమాన్, నా సామిరంగా మూడు సినిమాలు ముందున్న టికెట్ రేట్లతో విడుదలయ్యాయి. ఒక్క గుంటూరు కారానికే రేట్లు పెరిగాయి.

అసలే మిక్స్డ్ టాక్, మిగతా సినిమాల్లో హనుమాన్ ఇప్పటికే మౌత్ టాక్ తో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. మిగతా రెండూ కూడా బావున్నాయంటే గుంటూరు కారానికి పెద్ద ఇబ్బందే. ఇప్పుడు గుంటురు కారానికే ఈ పెరిగిన టికెట్ ధరలు కొంపముంచేలా కనబడుతున్నాయి.

TS and AP govt permits hike in ticket rates for Guntur Kaaram:

Telangana govt permits hike in ticket rates for Mahesh Babu Guntur Kaaram
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs