గుంటూరు కారం ఇది మహేష్ చెయ్యాల్సిన సినిమా కాదు అంటూ ఆయన అభిమానులే ఫీలవుతున్నారా?. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ చేసిన అతడు, ఖలేజా సినిమాలు థియేటర్స్ లో సో సో గా ఆడినా.. అవి టీవీ ఛానల్స్ లో ఎంత పెద్ద హిట్టో.. ఇప్పటికి ఆ చిత్రాలని బుల్లితెర మీద చూసేందుకు చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. త్రివిక్రమ్ మహేష్ తో చేసిన గుంటూరు కారం థియేటర్స్ లో యావరేజ్ టాక్ వచ్చినా అది టీవీలో కూడా నిలబడే సినిమా కాదంటున్నారు సగటు ప్రేక్షకులు. అంతేకాకుండా గుంటూరు కారం సినిమా చూసాక సోషల్ మీడియా వేదికగా జనాలు, ఆయన అభిమానులు ఇలా స్పందిస్తున్నారు.
మహేష్ బాబు సార్ చెయ్యవలసిన సినిమానే కాదు ఇది. త్రివిక్రమ్ గారు యద్దనపూడి గారి కీర్తికిరీటాలు నవల కథ ని కాపీ కొట్టి గుంటూరు కారం సినిమా చేసారని అంటున్నారు, ఆ నవల నేను చదవలేదు, కానీ మలయాళం లో 2005 లో వచ్చిన మమ్ముటి గారు నటించిన రాజమాణిక్యం సినిమాని అలాగే దించేశాడు. త్రివిక్రమ్ గారు మహేష్ గారి మీద పగబట్టి అతడు, ఖలేజా, ఇప్పుడు గుంటూరు కారం సినిమాలు తీస్తున్నాడేమో అనిపిస్తుంది.. సోషల్ మీడియా ప్రభావం లేని రోజుల్లో తాను ఎన్ని కాపీ సినిమాలు చేసినా కూడా జనాలు ఆదరించారు..
కానీ ఇప్పుడు పక్కబాషల సినిమాలు దొబ్బెయడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుంది.. త్రివిక్రమ్ గారు ఇప్పటికైనా ఒక్క సొంతకథతో సినిమా చేస్తే చూడాలని ఒక సినిమా అభిమానిగా కోరుకుంటున్నాను 🙏🙏👏👏🌹 అందరూ ఆయన పెన్నులో పవర్ తగ్గింది అంటున్నారు కానీ అస్సలు ఆయన పెన్నులో ఇంక్ యే లేదు అనేది గుంటూరు కారం చూసాక స్పష్టంగా కనిపిస్తుంది అంటున్నారు 🤷♂️🤷♂️🙏🙏, మహేష్ గారు మీరు ఈ కథ విని ఎలా ఒప్పుకున్నారు అంటూ కొంతమంది అభిమానులు సోషల్ మీడియాలో మహేష్ ని ప్రశ్నిస్తున్నారు.