Advertisement
Google Ads BL

అందుకే ప్రశాంత్ పై అమర్ కంప్లైంట్ ఇవ్వలేదు


బిగ్ బాస్ 7 గ్రాండ్ ఫినాలే  జరిగిన రోజున అమర్ దీప్ కారుపై పల్లవి ప్రశాంత్ అభిమానులు రాళ్లు రువ్వుతూ అతని ఫ్యామిలీని భయబ్రాంతులకు గురి చేసిన కేసులో పల్లవి ప్రశాంత్ జైలుకి వెళ్లాల్సి వచ్చింది. అమర్ దీప్ కారుపై మాత్రమే కాదు గీతూ రాయల్, అశ్విని కారుపై పల్లవి ప్రశాంత్ ఫాన్స్ రెచ్చిపోయి చేసిన డ్యామేజ్ కి గీతూ, అశ్వినీ వాళ్ళు పోలీస్ కేసు పెట్టారు. కానీ ఎక్కువగా ఈ దాడిలో సఫర్ అయిన అమర్ దీప్ మాత్రం పల్లవి ప్రశాంత్ పై కేసు పెట్టలేదు. మరోపక్క బిగ్ బాస్ హౌస్ లో వచ్చిన నెగిటివిటీ పోగొట్టుకోవడానికే అమర్ తన అభిమానులతో కావాలనే కారుకి డ్యామేజ్ చేయించుకుని తన కుటుంభ సభ్యులపై దాడి చేయించుకున్నాడనే ప్రచారం జరిగింది .

Advertisement
CJ Advs

అయితే అమర్ దీప్ పల్లవి ప్రశాంత్ పై కేసు పెట్టకపోవడానికి గల కారణాలు అమర్ దీప్ ఫ్రెండ్ నరేష్ లుల్లా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రివీల్ చేసాడు. తనపై దాడి జరిగిన క్షణం అమర్ కి ఏం అర్థం కాలేదని.. అప్పుడే తాను కారు దిగిపోతానని గొడవ చేసినట్లు గుర్తు చేశాడు. తన భార్య, తల్లిని సేఫ్ గా ఇంటికి తీసుకెళ్తే చాలని నరేష్ లొల్లను అమర్ అడిగినట్లు చెప్పాడు. ఆ సమయంలో తన ఫ్యామిలీని సేవ్ చేయడమే అమర్ కి కావాలనిపించిందని నరేష్ చెప్పుకొచ్చాడు. అందుకే అక్కడ అమర్ రెచ్చగొట్టే మాటలు కూడా మాట్లాడలేదని.. ఆ గొడవను మరింత పెద్దది చేయడం కూడా ఇష్టం లేకే పల్లవి ప్రశాంత్ పై పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదని వివరించాడు.

కానీ కొంతమంది అమర్ కంప్లైంట్ వలనే పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యాడని అనుకున్నారని.. కానీ అందులో ఏమాత్రం నిజం లేదని నరేష్ లొల్ల ఆ ఇంటర్వ్యూలో అసలు నిజాలని చెప్పుకొచ్చాడు.

That is why Amardeep did not file a complaint against Pallavi Prashant:

Naresh Lolla interview about Amardeep
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs