Advertisement
Google Ads BL

వైఎస్ జగన్ ఆట మొదలైంది


టార్గెట్ వైసీపీ రెబల్స్ స్టార్ట్..!

Advertisement
CJ Advs

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలకు సమయం దగ్గరపడింది. ఓ వైపు సీఎం వైఎస్ జగన్.. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థుల వేటలో పడ్డారు. అందరికంటే ముందుగా అభ్యర్థులను ఫిక్స్ చేయాలని నిర్ణయించుకున్న జగన్.. బిజిబిజీగా గడుపుతున్నారు. ఇన్‌చార్జుల మార్పేమో కానీ నిన్నటి జగన్‌కు మాత్రం షాకుల మీద షాకులు ఇస్తున్నారు ఆ పార్టీ నేతలు. అలాగే జగన్ ఏమైనా తక్కువ తిన్నారా? ఆయన కూడా తనకు ఎదురు తిరిగిన నేతలను టార్గెట్ చేయడం ప్రారంభించారు.అలాగే తాను ఇన్‌చార్జులుగా నియమించిన వ్యక్తులకు సహకరించని నేతలను సైతం భయపెట్టి మరీ దారికి తెచ్చుకునే యత్నం చేస్తున్నారు. వారిపైకి అధికారులను ప్రయోగించి దాడులు జరిపిస్తున్నారు. తాజాగా  కదిరిలో ఎమ్మెల్యే సిద్ధారెడ్డి  అనుచరులను వైసీపీ టార్గెట్ చేసింది. ఈసారి కదిరిలో సిద్దారెడ్డిని సైడ్ చేసి ఇన్‌చార్జ్‌గా మక్బుల్‌ను నియమించారు.

కదిరి వరకూ మాత్రమే అనుకుంటే తప్పులో కాలేసినట్టే..

మక్బుల్‌కు సహకరించని ఎమ్మెల్యే వర్గీయులకు సంబంధించిన వ్యాపారాలపై అధికారులను పంపి తనిఖీలు నిర్వహిస్తున్నారు. వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు మాజీ మున్సిపల్ చైర్మన్ రమేష్ రెడ్డి, వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి క్వారీలపై మైనింగ్ అధికారులు దాడులు జరుపుతున్నారు. అలాగే మరో నేత వాల్మీకి పవన్ కుమార్ రెడ్డి విద్యాసంస్థల్లోనూ విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇది కదిరి వరకూ మాత్రమే అనుకుంటే తప్పులో కాలేసినట్టే. అన్ని చోట్ల ఇదే పరిస్థితి. క్రమక్రమంగా తనకు ఎదురు తిరిగిన నేతలను జగన్ టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. రాయదుర్గంలోనూ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు.

జగన్ గేమ్ స్టార్ట్..

ఇటీవలే వైసీపీ అధిష్టానంపై ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ధిక్కార సర్వం వినిపించారు. వైఎస్‌ జగన్‌ని నమ్ముకుని వచ్చినందుకు తమ జీవితాలు నాశనం అయ్యాయంటూ మండిపడ్డారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన క్వారీలపై మైనింగ్ అధికారులతో దాడులు చేయిస్తున్నారు. బొమ్మనహాల్ మండలం నేమకల్లు సమీపంలో ఉన్న వాణిజ్య పన్నుల శాఖ, మైనింగ్ అధికారులు క్వారీల్లో తనిఖీలు చేపట్టారు. నిన్న మొన్నటి వరకూ ఆయన జీఎస్టీ చెల్లించని విషయం అధికారులకు పట్టలేదు. కాపు రామచంద్రారెడ్డి వైసీపీకి రాజీనామా చేయడంతో ఒక్కసారిగా ప్రభుత్వ శాఖలు రంగంలోకి దిగాయి. మొత్తానికి జగన్ కూడా గేమ్ మొదలు పెట్టారు. టార్గెట్ వైసీపీ రెబల్స్ స్టార్ట్..

YS Jagan game has started:

YS Jagan game start..
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs