జీవితంలో ఎలాంటి లక్ష్యం లేకుండా చిన్న చిన్న దొంగతనాలు చేసుకునే కుర్రాడు అనుకోకుండా సూపర్ హీరో గా మారడమే సింపుల్ గా హనుమాన్ స్టోరీ. అదే ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ లో మొదటగా చెప్పాలనుకున్నాడు. చిన్న హీరో, చిన్న దర్శకుడు, చిన్న సినిమా. ఇదే హనుమాన్ విడుదలయ్యే వరకు వినిపించిన మాట. ఇంత చిన్న సినిమాతో సంక్రాంతికి బడా హీరోలతో తొడకొట్టి బరిలోకి దిగడమంటే సాహసమే అన్నారు. అయినా వెనక్కి తగ్గలేదు, తెగువ చూపించారు హనుమాన్ మేకర్స్.
ఫలితం ఈరోజు హనుమాన్ విడుదలయ్యే రోజు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే హనుమాన్ ప్రభనజనమే. ప్రీమియర్స్ తోనే హనుమాన్ చిన్న సినిమా కాదు.. ఇది తన రేంజ్ అని చూపించేలా చేసాడు దర్శకుడు. హనుమాన్ ని వీక్షించిన ప్రతి ఒక్కరూ.. హనుమాన్ బావుంది.. తేజ సజ్జ యాక్టింగ్ సూపర్, ఎక్సట్రార్డినరీ, ప్రశాంత్ వర్మ మేకింగ్ అద్భుతం, సినిమాటోగ్రఫీ కేక, మధ్య మధ్యలో ఆహ్లాదంగా రవితేజ వాయిస్ ఓవర్, అమేజింగ్ మూవీ అంటూ పొగిడినవారే కానీ.. పొగడని వారు లేరు. క్రిటిక్స్ కూడా హనుమాన్ కి అన్ని వైపులా నుంచి బెస్ట్ రేటింగ్స్ ఇస్తున్నారు.
ఏ సోషల్ మీడియా హ్యాండిల్ చూసినా హనుమాన్ జాతరే కనిపిస్తుంది. మనకి సూపర్ హీరో వచ్చాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాని ఎంతో క్వాలిటీగా మంచి బడ్జెట్ పెట్టి నిర్మించారంటే అది ప్రశాంత్ వర్మ పై, కథపై నమ్మకమే, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాని మరింత ఎలివేట్ చేశాయి.
హనుమాన్ ఫస్ట్ హాఫ్ కామెడీ, సెకండ్ హాఫ్ యాక్షన్.. చివరి 20 నిముషాలు గూస్ బంప్స్ తెప్పించారంటూ ఒకటే మాట వినిపిస్తోంది..