Advertisement
Google Ads BL

బిగ్‌బాస్ జంట.. కుర్చీ పాటకి కుమ్మారు


సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల హీరోహీరోయిన్లుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన చిత్రం గుంటూరు కారం. ఇంకొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాపై ఏ రేంజ్‌లో అంచనాలున్నాయో తెలియంది కాదు. మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న హ్యాట్రిక్ మూవీ ఇది. అయితే ఈ సినిమా పాటల విషయంలో ఆ మధ్య ఏ రకంగా వార్తలు వైరల్ అయ్యాయో.. సోషల్ మీడియా ఫాలో అయ్యేవారందరికీ తెలిసిందే. కుర్చీ మడతబెట్టి పాట వచ్చే వరకు ఫ్యాన్స్‌లో కూడా ఊపు రాలేదు. ఆ పాట తర్వాత ఈ సినిమాని చూసే కోణమే మారిపోయింది. 

Advertisement
CJ Advs

కారణం.. ఈ పాటలో సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల వేసిన మాస్ స్టెప్స్ సోషల్ మీడియాని షేక్ చేశాయి.. చేస్తున్నాయి. శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో శ్రీలీల డ్యాన్సింగ్ బ్యూటీగా దూసుకెళుతోంది. ఆమె పక్కన డ్యాన్స్ చేసిన హీరోలంతా అబ్బో అంటున్నారంటే.. ఆమె డ్యాన్సింగ్ టాలెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ పాటలో వీరిద్దరూ వేసిన స్టెప్స్‌, సాంగ్ అన్నీ కూడా సినిమాపై భారీగా హైప్‌ని క్రియేట్ చేశాయి. ఇప్పుడీ పాటపై సోషల్ మీడియాలో వచ్చే రీల్స్‌కి లెక్కే లేదంటే నమ్మాలి. వయసుతో నిమిత్తం లేకుండా.. కుర్చీ పాటని కుమ్మి వదులుతున్నారు.

అదే కోవలో ఇటీవల ముగిసిన బిగ్ బాస్ సీజన్ 7లోని ఇద్దరు కంటెస్టెంట్స్ నిజంగా కుర్చీని మడతెట్టేశారు. ఒరిజినల్ పాటకు ఏ మాత్రం తగ్గకుండా.. వారు వేసిన స్టెప్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఇంతకీ ఎవరా ఇద్దరు? అనేది.. ఫై ఫొటో చూస్తుంటే తెలిసిపోతుంది కదా. ప్రిన్స్ యావర్, నయనీ పావని.. ఇద్దరూ కూడా మహేష్, శ్రీలీలను దించేశారు. ఇంకా డౌట్ ఉంటే.. కింది లింక్ కొట్టి వారి కుర్చీ మడతపెట్టే స్టెప్స్‌ని చూసేయండి.

 

పాటని చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

Prince Yawar and Nayani Pavani Dance Video Goes Viral:

Prince Yawar and Nayani Pavani Dance for Guntur Kaaram Kurchi Madathapetti Song
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs