Advertisement
Google Ads BL

హనుమాన్ కే సీటు లేదా.. థియేటర్స్ లో ?


ఈ సంక్రాంతి సినిమాలలో హడావిడి, హంగామా హనుమాన్ ప్రీమియర్స్ తో స్టార్ట్ అయ్యింది. ఎర్లీ ప్రీమియర్స్ అన్ని ఇంకొన్ని గంటల్లోనే ప్రారంభం కాబోతున్నాయి. ఈ 2024 సంక్రాంతి సినిమాల సంబరానికి తెరలేపింది హనుమాన్. ఈ దశలో వ్యక్తమవుతోన్న కొందరి అభిప్రాయమేమిటంటే.. 

Advertisement
CJ Advs

ఆ మధ్య వచ్చిన ఆదిపురుష్ సినిమాకి హనుమన్ విషయంలో చేసిన హడావిడీ అంతా ఇంతా కాదు. ప్రతి థియేటర్ లో హనుమాన్ కి ఓ సీట్ అంటూ ప్రకటించిన చిత్ర బృందం దానిని కొనసాగించిన తంతు కూడా అందరికి తెలిసిందే. ఆ సినిమా విషయంలో పబ్లిసిటి స్టంట్ కొంతవరకు వర్కౌట్ అయినా ఫైనల్ గా  సినిమా ఫలితంపై ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది.

మరిప్పుడు హనుమాన్ అనే టైటిల్ తోనే నేరుగా ఆయనే రంగంలోకి దిగుతున్న సమయంలో అటువంటి ప్రకటనేది రాకపోవడం గమనార్హం. అప్పటి ఆదిపురుష్ జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు. హనుమాన్ థియేటర్స్ కి హనుమాన్ రాడా? హనుమాన్ కి సీటు లేదా? అని. బహుశా.. ఇదే ఆలోచన హనుమాన్ మేకర్స్ కి కూడా వచ్చే ఉంటుంది. ఈ విషయంలో మనం అర్ధం చేసుకోవాల్సింది ఏమిటంటే.. రామనామం స్మరించే చోట హనుమంతుడుంటాడు, హనుమాన్ ఉన్న చోట ఆయన భక్తులు, ఆయన కోసం వెళ్లే వీక్షకులు ఉంటారు.

చిన్న సినిమాగా మొదలై పెద్ద ప్రకంపనలు రేపుతూ విజువల్ వండర్  గా సంక్రాంతి సంబరంగా ప్రేక్షకుల ముందుకు వస్తోన్న హనుమాన్ తాలూకు విశ్లేషణ కోసం, వివరణాత్మక సమీక్ష కోసం Stay tuned to Cinejosh..

No seat for Hanuman.. in theaters?:

Hanuman releasing tomorrow
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs