రెండు రోజులుగా హీరో నితిన్ వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్న తమ్ముడు షూటింగ్ సెట్స్ లో గాయపడడంతో, షూటింగ్ ని అర్ధాంతరంగా ఆపేసారు, నితిన్ కి తగిన గాయాల వలన ఆయన మూడు వారాల పాటు రెస్ట్ తీసుకోవాలి, అందుకే ఆయన హైదరాబాద్ కి వచ్చేసారు అంటూ ప్రచారం జరుగుతుంది. ఏపీలోని మారేడుమిల్లు అడవుల్లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటున్న తమ్ముడు షూటింగ్ ప్రస్తుతం వాయిదా పడింది అన్నారు. అయితే నితిన్ కి షూటింగ్ లో ప్రమాదం జరిగింది అనే వార్త చూసిన చిత్రం బృందం అసలు విషయం క్లారిటీ ఇచ్చింది.
తమ్ముడు షూటింగ్ సెట్స్ లో హీరో నితిన్ కి ఎలాంటి ప్రమాదం జరగలేదు, అందులో నితిన్ గాయపడలేదు, ప్రస్తుతం నితిన్ భుజం నొప్పితో ఇబ్బంది పడుతున్నాడని, అందుకే షూటింగ్ కు బ్రేక్ ఇచ్చామని తెలిపింది. యాక్షన్ సన్నివేశాల కోసం ఆంధ్రప్రదేశ్ లోని మారేడుమిల్లి అడవుల్లో బస చేసిన చిత్ర బృందం.. నితిన్ అనారోగ్యం కారణంగా ప్రస్తుతం షూటింగ్ నిలిపివేసింది.. నితిన్ హైదరాబాద్ లో తన ఇంటికి చేరుకొని ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారని చిత్ర బృందం తెలియయజేసింది. దానితో నితిన్ అభిమానులు కాస్త కూల్ అయ్యారు.