క్రికెట్ కి గుడ్ బై చెప్పినప్పటి నుంచి వైస్సార్సీపీ పార్టీకి మద్దతుగా కనిపించిన అంబటి రాయుడు ఈమధ్యనే సీఎం జగన్ ఆధ్వర్యంలో వైసీపీలో జాయిన్ అయ్యాడు. జగన్ స్వయంగా అంబటి రాయుడికి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆ తర్వాత ఏమైందో ఏమో వారం తిరిగేలోపు వైస్సార్సీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా అంబటి రాయుడు ప్రకటించాడు. అంతేకాదు.. కొద్దిరోజులు రాజకీయాలకి దూరంగా ఉండాలనుకుంటున్నట్టుగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు.
తీరా ఇప్పుడు అంబటి రాయుడు వైసీపీ నాయకులకి, మీడియా వారికి ట్విస్ట్ ఇస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని కలవడం చర్చనీయాంశమైంది. దానితో మీడియా లో జనసేన పార్టీలోకి అంబటి రాయుడు అంటూ కథనాలు ప్రచారంలోకి వచ్చేసాయి. అసలు రాజకీయాలకే దూరంగా ఉంటాను అన్న వ్యక్తి ఇప్పుడు ఉన్నట్టుండి పవన్ తో భేటీ కావడం వెనుక రాజకీయ కారణాలు తప్ప మరేది లేదు అని మాట్లాడుకుంటున్నారు. గుంటూరు లోక్ సభ స్థానం కోసమే అంబటి రాయుడు జనసేనలోకి చేరబోతున్నాడా అనే డౌట్ వస్తుంది.
మరి వైసీపీ నుంచి ఎందుకు వచ్చాడు, ఇప్పుడు ఇలా జనసేనలోకి ఎందుకు వెళుతున్నాడు, వైసీపీ అంబటికి ఏం అన్యాయం చేసింది, జనసేన ఏం న్యాయం చేస్తుంది అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ గా జరుగుతున్న చర్చ. అంతేకాదు వారం గ్యాప్ లో రెండు పార్టీలు అంటూ నెటిజెన్స్ కామెడీ చేస్తున్నారు.