స్టార్ హీరోలపై అభిమానులు ఎంతో అభిమానం చూపిస్తారు. తమ హీరో పుట్టిన రోజులు వచ్చినా, సినిమాలు విడుదలవుతున్నా అభిమానులు హీరోలకి కటౌట్స్ పెట్టి పాలాభిషేకాలు చేస్తూ, కేక్ కట్స్ చేస్తూ హంగామా చేస్తారు. అంతేకాకుండా ఫ్లెక్సీలు కట్టడం, బాణా సంచా కాల్చడం ఇవన్నీ చేస్తూ రచ్చ చేస్తారు. ఇప్పుడు KGF హీరో యష్ బర్త్ డే రోజున ఆయన అభిమానులు ఫ్లెక్సీలు కడుతూ.. ముగ్గురు అభిమానులు కరెంట్ షాక్ కొట్టి చనిపోవడంతో హీరో యష్ ఎమోషనల్ అవుతున్నాడు. అందుకే తను తన పుట్టిన రోజుని సైలెంట్ గా ఉంటానని చెబుతున్నాడు.
తన బర్త్ డే కి ఫ్లెక్సీ కడుతూ అభిమానుల మృతి చెందారన్న విషయం తెలిసిన యష్ హడవిడిగా షూటింగ్ ఆపేసి స్పెషల్ ఫ్లైట్ లో హుబ్లీకి చేరుకొని అభిమానులు మృతి చెందిన గడగ్ జిల్లాలోని సురంగి ప్రాంతానికి కారులో చేరుకుని బాధిత కుటుంబాలని ఓదార్చాడు. అభిమానుల మృతితో కంటతడి పెట్టుకున్న యష్.. ఇలాంటివి జరక్కూడదనే తాను పుట్టిన రోజు వేడుకలకి దూరంగా ఉంటాను, చనిపోయిన వారిని తీసుకురాలేము, కానీ వారి కుటుంబాలకి అండగా ఉంటాను అంటూ భరోసా ఇచ్చాడు.
చేతికి అందిన బిడ్డలు ఇక లేరు అంటే ఆ కుటుంభాల పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకుంటాను, తిరిగి వారికి తమ బిడ్డలని తిరిగి తీసుకురాలేను, కానీ వారి బిడ్డలు వారి కుటుంబాలకి ఏం చేసేవారో అవన్నీ తమ బిడ్డ స్థానంలో ఉండి నేను చేస్తాను, అభిమానులకి నేను చెప్పేది ఒక్కటే, మీరు మీ లైఫ్ లో సంతోషంగా ఉండండి, మా గురించి ఆలోచించకండి, మీ తల్లితండ్రుల గురించి ఆలోచించండి, మరోసారి ఇలా చెయ్యకండి, నేను మీకు చేతులు జోడించి అడుగుతున్నాను, ఇక నుంచి ఇలాంటి ఫ్లెక్సీలు కట్టే పని మానెయ్యండి, అది ఎంత ప్రమాదకరమో చూసారుగా అంటూ యష్ ఎమోషనల్ అవుతూ మీడియాతో మాట్లాడాడు.