కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లకపోయినా.. రాజకీయాలకి దూరంగా ఉన్నా.. నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీకి వీర విధేయత చూపిస్తాడు. తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, రేవంత్ రెడ్డి సీఎం గా అవ్వడంతో చాలా ఉత్సాహంలో ఉన్న బండ్ల గణేష్.. తెలంగాణ రేవంత్ రెడ్డి నెల రోజులు పాలన పూర్తయిన సందర్భంగా మాట్లాడాడు.
నిన్నటితో ప్రజాపాలన 30 రోజులు పూర్తి చేసుకుంది..
అన్ని రాష్ట్రాలు మెచ్చుకునే విధంగా ప్రజాపాలన జరుగుతుంది..
ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి , మంత్రులు ప్రజాపధం వైపుకు దూసుకుపోతున్నారు .
మాజీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్ కు ఈర్ష పిక్ స్టేజ్ కి చేరుకుంది..
వందరోజుల తర్వాత మా పప్పులు ఉడకడం కాదు బిర్యాని కూడా ఉడుకుతుంది హరీష్ రావ్ .. అంటూ ఘాటుగా స్పందించాడు.
ఈ పది సంవత్సరాలు ఏం చేశారు హరీష్ రావు తెలంగాణకి రావలసిన హామీలపై ఏమైనా కేంద్రంతో కొట్లాడారా..
ముఖ్యమంత్రి ,మంత్రులు ప్రధానమంత్రి , కేంద్ర మంత్రులతో మాట్లాడుతూ తెలంగాణకి రావలసిన నిధులు పోరాటం చేస్తున్నారు..
అవినీతి అధికారులను పక్కకు తప్పుంచి నిజాయితీ అధికారులను నియమించుకొని పరిపాలన చేస్తున్నారు మా ముఖ్యమంత్రి..
పార్లమెంటు ఎన్నికల్లో మీరు ఒక్క స్థానం కూడా గెలవరు.
రాష్ట్రపతి వస్తే స్వాగతం పలకడానికి కూడా మీ ముఖ్యమంత్రి వెళ్లలేదు హరీష్ రావ్ ..
మాజీ రాష్ట్రపతి వస్తే మా ముఖ్యమంత్రి వెళ్లారు..
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలందరికీ అందుబాటులో ఉంది..
ఏ సమస్య ఉన్న ప్రజలు సచివాలయం కి వెళ్తున్నారు..
హరీష్ రావు , కేటీఆర్ ఎందుకు ఇంతగా ఆగం అవుతున్నారు ..
ప్రగతి భవనాన్ని మా దళిత ఉప ముఖ్యమంత్రికి ఇచ్చారు.. అంటూ బండ్ల గణేష్ రేవంత్ రెడ్డి పాలనపై రివ్యూ ఇచ్చేసాడు.