Advertisement
Google Ads BL

గుంటూరు కారం ట్రైలర్: అతి పెద్ద కంప్లైంట్


గుంటూరు కారం విడుదలకు ఇంకా నాలుగు రోజులు మాత్రమే సమయముంది. మంగళ, బుధ, గురు.. శుక్రవారం గుంటూరు కారం వచ్చేస్తుంది. నిన్న ఆదివారం గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ చేసారు. రేపు మంగళవారం గుంటురు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గుంటూరు లో నిర్వహించబోతున్నారు మేకర్స్. మహేష్ అభిమానులు గుంటురు కారం కోసం పూనకాలతో ఎదురు చూస్తున్నారు. అంతేకాదు గుంటూరు కారం ట్రైలర్ వస్తుంది.. సినిమాపై మరింతగా అంచనాలు పెంచుతుంది అన్నారు.

Advertisement
CJ Advs

గుంటూరు కారం ట్రైలర్ వచ్చింది.. అందులో మహేష్ ఎనెర్జిగా కనిపించారు, పవర్ ఫుల్ లుక్స్, శ్రీలీల గ్లామర్, డాన్సులు, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, జగపతి బాబు ఇలా అన్ని కేరెక్టర్స్ బావున్నాయి. అంతా బాగానే ఉంది.. కాని ఈ చిత్రంలో త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ వినిపించలేదు అని త్రివిక్రమ్ అభిమానులు నిరాశపడుతుంటే.. అసలు ముఖ్యంగా ఈ ట్రైలర్‌ చూసాక చాలామందికి మహేష్ చెప్పిన డైలాగ్స్ ఏమి అర్ధం కాలేదు, హోం థియేటర్‌లో కానీ, టీవీలో కానీ ట్రైలర్ చూస్తే  డైలాగ్స్ క్లారిటీ రావట్లేదట, సౌండ్ మిక్సింగ్ సరిగా కుదరలేదని చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు.

సినిమా థియేటర్లలో కూడా ఇలా ఉంటే సమస్య అవుతుందని మహేష్ ఫ్యాన్స్ లో అసంతృప్తితో పాటుగా అందోళన కూడా మొదలైంది. టీవీ లో HD లో పెట్టుకుని ఆత్రంగా ట్రైలర్ ఓపెన్ చేస్తే మొదటిసారి మహేష్ ఏ డైలాగ్స్ చెప్పాడో అర్ధం కాలేదు.. దానితో రెండోసారి ట్రైలర్ ని వీక్షించి స్లో మోడ్ లో పెట్టుకుని చూస్తేగానీ అర్హం కాలేదు అనే కంప్లైంట్ చాలామంది నుంచి వ్యక్తమవుతోంది. 

Biggest complaint about Guntur Kaaram trailer:

Fans disappointed with this aspect of Guntur Kaaram trailer
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs