Advertisement
Google Ads BL

మాల్దీవులకు మోత మోగిపోతుంది


టాలీవుడ్ నుంచి బాలీవుడ్ సెలబ్రిటీస్ వరకు.. షూటింగ్స్ నుంచి కాస్త బ్రేక్ దొరకగానే.. అలా మాల్దీవులకు వెకేషన్స్ అంటూ ఫ్లైట్ ఎక్కేస్తున్నారు. పెళ్లయ్యాక హనీమూన్ కి కూడా అక్కడికే వెళుతున్నారు చాలామంది సెలబ్రిటీస్. బర్త్ డే వేడుకలు, వేసవి తాపం ఇలా హిందీ యాక్టర్స్, తెలుగు, తమిళ హీరో-హీరోయిన్స్ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చెయ్యడానికి మాల్దీవులనే ఎంచుకుంటున్నారు. అంతకుముందు గోవా, బ్యాంకాక్, థాయిలాండ్ అంటూ వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు చాలావరకు మాల్దీవులకే వెళుతున్నారు. అలా పర్యాటక ప్రదేశంగా పేరు పొందిన మాల్దీవులకు ఈ సెలబ్రిటీస్ రాకతో బాగా డిమాండ్ పెరిగి కోట్లు వెనకేసుకుంటున్నారు వారు.

Advertisement
CJ Advs

కానీ ఇప్పుడు మాల్దీవులకు వెకేషన్స్ కి వెళ్ళాలి అనుకున్న వారు చేసుకున్న హోటల్ బుకింగ్స్, ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ చేసుకుని మాల్దీవుల దేశానికి బిగ్ షాకిచ్చారు. కారణం మాల్దీవుల దేశానికి చెందిన మంత్రులు ఇండియా ని కించపరుస్తూ మట్లాడడమే. అది ఎందుకు అంటే.. రీసెంట్ గా ప్రధాని మోడీ లక్షద్వీప్ ని సందర్శించి.. పర్యాటకులకు లక్షద్వీప్ బెస్ట్ ప్లేస్ అంటూ చేసిన ట్వీట్ తో మాల్దీవులకు చెందిన మంత్రులు ఇండియాని కించపరుస్తూ మాట్లాడంతో అసలు సమస్య మొదలైంది. 

ఇండియాని అంటే ఊరుకోరుగా అందుకే. #BoyCott Maldives హాష్ టాగ్స్ తో మాల్దీవులకి వెకేషన్స్ కి వెళ్ళాలి, వెళుతున్న వారంతా బుకింగ్స్ క్యాన్సిల్ చేసుకోవడమేగాకదు.. మాల్దీవులకు వ్యతిరేఖంగా పడుతున్న పోస్ట్ లతో మాల్దీవుల కి మోత మోగిపోతుంది. #BoyCott Maldives హాష్ టాగ్ సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంది. దానితో మాల్దీవుల హోటల్స్ వెలవెలబోతున్నాయి. మాల్దీవుల సముద్రపు బీచ్ లు ఖాళీగా కనబడుతున్నాయి.  

BoyCott Maldives trends on twitter X:

Boycott Maldives Trends As Politician Mocks PM Modi Lakshadweep Visit
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs