Advertisement
Google Ads BL

జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ vs టీడీపీ కార్యకర్తలు


గత కొన్నేళ్లుగా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీతో అంటీముట్టనట్టుగా ఉంటున్నాడు. అంటీముట్టనట్టుగా కాదు.. ఆల్మోస్ట్ పార్టీకి దూరంగానే ఉంటున్నాడు. రాజకీయాలపై జూనియర్ ఎన్టీఆర్ అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అటు లోకేష్ ని హైప్ చేసే ప్రయత్నాల్లో జూనియర్ ఎన్టీఆర్ ని టీడీపీ కి దూరం చేస్తున్నారనే కసి చాలామందిలో ఉంది. జూనియర్ వస్తే లోకేష్ ప్రాధాన్యత తగ్గుతుంది అని.. అందుకే చంద్రబాబు సైతం ఎన్టీఆర్ ని పక్కనబెట్టేశారనే టాక్ ఉంది. చాలామంది టీడీపీ కార్యకర్తలు జూనియర్ పార్టీలోకి రావాలంటూ కొన్నాళ్లుగా నినాదాలు చేస్తున్నారు.

Advertisement
CJ Advs

ఇక నిన్న ఆదివారం ఉద‌యం ఉమ్మ‌డి కృష్నా జిల్లాలోని తిరువూరు, పశ్చిమగోదావరి జిల్లా అచంటలో రా.. క‌ద‌లిరా! అంటూ నారా చంద్రాబు నాయుడు సభలు నిర్వహించారు. ఈ సభలకి అటు టీడీపీకార్యకర్తలు, ఇటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా హాజరయ్యారు. సభలో చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ ఫొటోలతో కూడిన ప్లకార్డు ల‌ను ప్ర‌ద‌ర్శించారు. పార్టీ నుంచి ఆయ‌న‌ను దూరం పెట్టార‌ని, పార్టీలో జూనియ‌ర్‌ ఎన్టీఆర్ కు స్థానం క‌ల్పించాలంటూ అభిమానులు నినాదాలు చేశారు. 

దానితో టీడీపీ సభకు వాలంటీర్లుగా పని చేస్తున్నవారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి సర్ది చెప్పినా వినలేదు, దానితో టీడీపీ కార్య‌క‌ర్త‌లు జూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమానులను తోసెయ్యడంతో అక్కడ గొడవ స్టార్ట్ అయ్యింది. ఇరువురి మధ్యన వాగ్వివాదం, తోపులాట చోటు చేసుకుంది. ఆగ్రహంతో టీడీపీ కార్యకర్తలు కొందరు జూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమానుల‌పై చేయిచేసుకున్నారు. విష‌యం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి.. ఇరు ప‌క్షాల‌ను వారించినా మాట వినకపోయేసరికి పోలీసులు కొంద‌రిపై లాఠీలు కూడా ఝ‌ళిపించారు. దానితో గొడవ సర్దుమణిగింది. 

రా.. క‌ద‌లిరా! స‌భ‌లో కావాలనే కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కలకలం సృష్టించి గొడవకు కారణమయ్యారంటూ టీడీపీ నాయ‌కులు చెబుతున్నారు. మరికొందరు జూనియర్ ఎన్టీఆర్ పై కోపంతో లోకేష్ అభిమానులే ఈ పని చేశారంటున్నారు.

Jr NTR:

TDP
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs