Advertisement
Google Ads BL

టీడీపీ, జనసేన స్కెచ్ సిద్ధం..!


టీడీపీ, జనసేనల పొత్తును ఎలాగైనా సక్సెస్ చేసుకోవాలని ఇరు పార్టీల అధినేతలు ఫిక్స్ అయినట్టున్నారు. ప్రణాళికను సిద్ధం చేసుకుని మరీ రంగంలోకి దిగారు. ఎలాగైనా అధికారంలోకి రావాలని వ్యూహాలు సిద్ధం చేసుకున్నారు. టీడీపీ అయితే ప్రాంతాల వారీగా విభజించుకుని మరీ రంగంలోకి దిగింది. జనసేన కూడా ఈసారి వ్యూహాన్ని మార్చేసింది. ఈసారి కాపులంతా జనసేనకు అండగా నిలుస్తున్నారు. ఇక టీడీపీ, జనసేనల పొత్తును కూడా కేడర్ అంగీకరించింది. వీరంతా అధికారపక్షం ఎత్తులకు తలొగ్గకుండా పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేస్తున్నారు. 

Advertisement
CJ Advs

అభ్యర్థులు సైతం ఫిక్స్..!

ఈ తరుణంలోనే పొత్తులో భాగంగా సీట్ల పంపకంపై కూడా ఇరు పార్టీల మధ్య సయోధ్య కుదిరినట్టుగా తెలుస్తోంది. జనసేనకు 35 సీట్లు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించినట్టుగా సమాచారం. సీట్లు ఫిక్స్.. ఈ క్రమంలోనే జనసేన అభ్యర్థులు కూడా దాదాపు ఫిక్స్ అయినట్టే తెలుస్తోంది. ఇక అభ్యర్థులకు ఈ మేరకు పవన్ నుంచి సూచనలు కూడా అందాయట. దీంతో అభ్యర్థులంతా పీఆర్ టీమ్‌ను ఎంచుకునే పనిలో ఉన్నారని టాక్. ఇక ఈసారి కూడా వపన్ రెండు చోట్ల నుంచి పోటీ చేయనున్నారట. అయితే గతంలో పోటీ చేసిన గాజువాక, భీమవరంల నుంచి ఈసారి పవన్ పోటీ చేయబోరని తెలుస్తోంది. ఇప్పుడు పిఠాపురం, తిరుపతి స్థానాలను జనసేనాని ఎంచుకున్నారట.

కనిగిరి నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించిన చంద్రబాబు..

ఇక టీడీపీ కూడా ఈ దఫా ఎన్నికల్లో విజయానికి చక్కగా ప్లాన్ చేసుకుంది. ఈ క్రమంలోనే ఆ పార్టీ ఏపీని మూడు భాగాలుగా విభజించినట్టు సమాచారం. 

ఏపీని మూడు భాగాలుగా టీడీపీ విభజించినట్టుగా తెలుస్తోంది. ఈ మూడు భాగాలను చంద్రబాబు.. తన కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు ఒక ప్రాంతాన్ని.. తన సతీమణి భువనేశ్వరికి మరో ప్రాంతాన్ని కేటాయించి మూడో భాగం సహా ఓవరాల్ రాష్ట్రంలో పర్యటించే బాధ్యతను చంద్రబాబు తీసుకున్నారు. ఉత్తరాంధ్రలో భువనేశ్వరి.. రాయలసీమ చంద్రబాబు.. మిగిలినవన్నీ లోకేష్ పర్యటించనున్నారు. ఫైనల్‌గా రాష్ట్రం మొత్తాన్ని చంద్రబాబు చుట్టేయనున్నారు. ఇప్పటికే కనిగిరి నుంచి ఎన్నికల శంఖారావాన్ని చంద్రబాబు పూరించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే భువనేశ్వరి సైతం రంగంలోకి దిగారు. మొత్తానికి టీడీపీ, జనసేనలు ఓ రేంజ్‌లో దూసుకెళుతున్నాయి.

TDP, Jana Sena sketch ready..!:

TDP - Janasena candidates are also fixed..!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs