Advertisement
Google Ads BL

GK: శ్రీలీల పారితోషకమే హాట్ టాపిక్


ఈరోజు ఆదివారం, మరికాసేపట్లో గుంటురు కారం ట్రైలర్ రాబోతుంది. ఈ చిత్రంలో మహేష్ తో అందులోను స్టార్ హీరోతో మొదటిసారిగా జోడీ కడుతున్న శ్రీలీల పైన అందరి చూపు. గత ఏడాది యంగ్ హీరోలు వరసగా షాకులిచ్చారు. రామ్, నితిన్, వైష్ణవ తేజ్ ఇలా ఏ హీరో కూడా శ్రీలీలకి సక్సెస్ ఇవ్వలేదు. కానీ శ్రీలీల క్రేజ్ మాములుగా లేదు. ప్రస్తుతం గుంటూరు కారం ప్రమోషన్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శ్రీలీల ఈచిత్రంలో నటించినందుకు ఎంత పారితోషకం అందుకుందో అనేది అందరిలో ఆతృతగా కనిపిస్తున్న ప్రశ్న,

Advertisement
CJ Advs

అసలైతే శ్రీలీలది ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ రోల్. ముందుగా ఈ సినిమాలో సకెండ్ హీరోయిన్ గా శ్రీలీలను తీసుకున్నారు. అప్పుడు పూజ హెగ్డే ఫస్ట్ హీరోయిన్. సెకండ్ రోల్ కి 77 లక్షల రెమ్యునరేషన్ ఇస్తామని శ్రీలేలని ఒప్పించారట మేకర్స్. కానీ ఆ తర్వాత శ్రీలీల క్యారెక్టర్ ను ఫస్ట్ హీరోయిన్ గా లీడ్ రోల్ కి తీసుకు వచ్చారు. అయితే మొదటి హీరోయిన్ గా ఈమెకి అవకాశం దక్కించుకున్నప్పటికీ.. రెమ్యునరేషన్ మాత్రం పెంచమని శ్రీలీల నిర్మాతలని అడగలేదట. ముందు ఒప్పుకున్నట్లుగానే 77 లక్షలకే ఈ సినిమా చేస్తోందని టాక్. 

సోలో హీరోయిన్ గా రెండు కోట్ల వరకు అందుకుంటున్న శ్రీలీల గుంటురు కారం కోసం మాత్రం 77 లక్షలకే ఒప్పుకోవడం విచిత్రమే. గుంటూరు కారం సినిమా జనవరి 12వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ చిత్రం అయినా హిట్ అవ్వాలని శ్రీలీల బలంగా కోరుకుంటుంది. 

Sreeleela remuneration is a hot topic:

Sreeleela remuneration for Guntur Kaaram
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs