Advertisement
Google Ads BL

సీఎం రేవంత్ నెలరోజుల పాలన హైలైట్స్


డిసెంబర్ 7 న తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల రోజుల్లో తెలంగాణ ప్రజల్లో తనదైన ముద్ర వేశారు. సీఎం అయిన మరుసటి రోజు నుంచే బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం కల్పించడం దగ్గర నుంచి ఎన్నో రకాలుగా తన ప్రత్యేకని చూపించిన రేవంత్ రెడ్డి తన నెల రోజుల పాలనపై సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

Advertisement
CJ Advs

సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చింది. 

సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ… పాలనను ప్రజలకు చేరువ చేస్తూ… అన్నగా నేనున్నానని హామీ ఇస్తూ జరిగిన నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చింది.

పేదల గొంతుక వింటూ… యువత భవితకు దారులు వేస్తూ… మహాలక్ష్ములు మన ఆడబిడ్డల మొఖంలో ఆనందాలు చూస్తూ… రైతుకు భరోసా ఇస్తూ… సాగిన నెల రోజుల నడక ఉజ్వల భవిత వైపునకు అడుగులు వేస్తోంది.

పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామంటూ… పారిశ్రామిక వృద్ధికి పెద్దపీట వేస్తూ… నగరాల అభివృద్ధికి నగిషీలు చెక్కుతూ… మత్తులేని ఛైతన్యపు తెలంగాణ కోసం గట్టి పట్టుదలతో సాగిన ఈ నెల రోజుల పాలన బాధ్యతగా సాగింది.

రేవంతన్నగా నన్ను గుండెల్లో పెట్టుకున్న తెలంగాణ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇక ముందు కూడా నా బాధ్యత నిర్వర్తిస్తా.. అంటూ రేవంత్ ట్వీట్ చేసారు.

A month-long rule went on by understanding the situation - CM Revanth Reddy:

CM Revanth Reddy tweets on one month ruling
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs