బాలీవుడ్ లో ప్రేమలు, పెళ్లిళ్లు, డేటింగ్ లు ఎంత కామానో, బ్రేకప్ లు అంతే రొటీన్. అక్కడ బ్రేకప్స్ పెద్దగా షాకివ్వవు. అది చాలా లైట్ అన్నట్టుగా ఉంటుంది. భర్త అర్భాజ్ ఖాన్ కి విడాకులిచ్చి కొడుకుతో సహా విడిగా ఉంటూనే.. కుర్ర హీరో అర్జున్ కపూర్ తో ఎన్నో ఏళ్లగా డేటింగ్ లో ఉన్న మలైకా అరోరా ఇప్పుడు అర్జున్ కపూర్ తో బ్రేకప్ చేసుకుంది అనే న్యూస్ బి టౌన్ లో హాట్ హాట్ గా ప్రచారంలోకి వచ్చింది. ఎప్పుడూ కలిసి కనిపించే మలైకా అరోరా-అర్జున్ కపూర్ లు ఇప్పుడు ఎక్కడా కలిసి కనిపించడమే లేదు.
కొద్దిరోజులుగా మలైకా-అర్జున్ కపూర్ లు దూరం దూరంగా ఉంటున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. 40 ప్లస్ లో అర్జున్ కపూర్ తో సీక్రెట్ డేటింగ్ చేసిన మలైకా రెండు మూడేళ్ళుగా అర్జున్ కపూర్ తో కలిసి బహిరంగంగానే వెకేషన్స్ కి వెళుతూ.. డిన్నర్ డేటింగ్, లంచ్ టైమ్, పార్టీలు, పెళ్లిళ్లు అంటూ తిరిగింది. అయితే ఈమధ్యన క్రిష్ట్మస్ వేడుకల్లో, న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ లో మలైకా అరోరా స్నేహితులతో కలిసి కనిపించింది కానీ.. అర్జున్ కపూర్ తో కనిపించకపోయేసరికి వారిరువురికి బ్రేకప్ అయ్యింది అనే న్యూస్ మొదలైంది.
మరి ఈ విషయమై అటు కుర్ర హీరో కాని, ఇటు ఈ ముదురు భామ కానీ స్పందిస్తేనే తెలుస్తుంది. లేదంటే ఓసారి కలసి కనబడితే ఈ బ్రేకప్ రూమర్స్ మొత్తం గాలికి కొట్టుకుపోతాయి. ఇక మలైకా భర్త అర్భాజ్ రీసెంట్ గానే సెకండ్ మేరేజ్ చేసుకున్న విషయం తెలిసిందే.