మహేష్ ఫాన్స్ ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్న క్షణం వచ్చేసింది. అసలైతే నిన్న శనివారం రాత్రే సెలెబ్రేట్ చేసుకోవాలనుకున్న మహేష్ అభిమానులు ఒక్క రోజు లేటుగా సెలెబ్రేషన్స్ కి రెడీ అవుతున్నారు. అది దేనికి అంటే గుంటురు కారం ట్రైలర్ కోసం. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే గుంటురు కారం ట్రైలర్ వచ్చేస్తుంది అనుకుంటే.. ఆ ఈవెంట్ సెక్యూరిటీ రీజన్స్ వలన వాయిదా పడింది. దానితో మహేష్ ఫాన్స్ కాస్త డిస్పాయింట్ అయ్యారు. ఈలోపులో మేకర్స్ మహేష్ గుంటురు కారం ట్రైలర్ అప్ డేట్ ఇచ్చేసారు.
ఈరోజు గుంటూరు కారం ట్రైలర్ అంటూ ఇచ్చిన అప్ డేట్ తో అభిమానులు అలెర్ట్ అయ్యారు. సమయమెప్పుడు అనేది చెప్పకపోయినా.. ఈరోజు అనే మాట అభిమానుల చెవిన పడగానే సంబరాలకు సిద్దమైపోతురున్నారు. జనవరి 12 న విడుదల కాబోతున్న మహేష్ బాబు గుంటురు కారం కోసం అందరూ వెయిటింగ్. పండగ సినిమాల్లో మొదటగా క్రేజీగా వచ్చే సినిమా గుంటురు కారం కావడంతో.. ఈ సినిమాపై భీభత్సమైన అంచనాలున్నాయి. ఇక ఆంచనాలు ఈరోజు రాబోయే ట్రైలర్ తో మరింతగా పెరిగిపోవడం ఖాయం.